అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ అంటూ రాజ్ అండ్ డీకే ద్వయం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో వెబ్ వరల్డ్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేసారు, మనోజ్ బాజ్‌పేయి మెయిన్ లీడ్లో ఇప్పటికే మూడు సీజన్స్ ను ఆడియన్స్ కు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతము నవంబర్ 21 నుంచి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చింది.
ఎప్పటిలాగే ఈ సీజన్ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. మనోజ్ బాజ్‌పేయి యాక్టింగ్, నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, రాజ్ అండ్ డీకే మేకింగ్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కి ప్లస్ పాయింట్స్ అంటూ ఆడియన్స్ అంటున్నారు. క్రిటిక్స్ కూడా మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చారు.
అయితే ఈ ఫ్యామిలీ మ్యాన్ లో యాక్ట్ చేసిన నటుల పారితోషికాలపై అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ కనబడుతుంది. అయితే శ్రీకాంత్ తివారీ పాత్రలో నటించిన మనోజ్ బాజ్‌పేయి ఈ సీజన్ కి అత్యధికంగా 20 నుంచి 22 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్లుగా తెలుస్తుంది. సుచిత్ర పాత్రధారి ప్రియమణి 7 కోట్లు, విలన్‌గా నటించిన జైదీప్ అహ్లావత్‌కి 9 కోట్లు, నిమ్రత్ కౌర్‌కి 8 నుంచి 9 కోట్లు మేకర్స్ ఇచ్చిఅంట్లుగా టాక్ వినబడుతుంది.
అంతేకాకుండా దర్శన్ కుమార్‌కి 9 కోట్ల రూపాయలు, సీమా బిస్వాస్, విపిన్ శర్మలకు 1 నుంచి 2 కోట్ల రూపాయలను పారితోషికంగా చెల్లించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.




పెళ్లి వాయిదా వేసుకున్న క్రికెటర్ స్మృతి మందన
Loading..