నాగ చైతన్య హీరోయిన్ సమంత ను ప్రేమించి పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ జంట ను ఎప్పుడు చూసినా దిష్టి తగులుతుందా అనిపించేలా వారిద్దరూ ముద్దుగా కనిపించేవారు. నిజంగా ఏ దిష్టి తగిలిందో తెలియదు కానీ సమంత-నాగ చైతన్య లు విడిపోయారు. ఆతర్వాత ఎవరి ప్రొఫెషన్ లో వారు బిజీ అయ్యారు.
నాగ చైతన్య.. సమంత తో విడిపోయాక మరో హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ని ప్రేమించారు. సీక్రెట్ డేటింగ్ తో మరోసారి పెద్దల అంగీకారంతో శోభిత ను అంగరంగ వైభవంగా చేసుకున్నారు. ఆతర్వాత ఈ జంట చూడముచ్చటగా కనిపిస్తుంది. ఎవరి షూటింగ్స్ లో వారు బిజీగా ఉన్నా సమయమున్నప్పుడల్లా వెకేషన్స్ లో అలాగే ఫ్యామిలీ ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు.
తాజాగా నాగ చైతన్య బర్త్ డే రోజున శోభిత భర్త ని లవర్ అంటూ విష్ చేస్తూ చైతు తో ఉన్న రొమాంటిక్ పిక్ షేర్ చేసింది. ఆ పిక్ లో శోభిత చీరకట్టులో జాకెట్ వేసుకోగా.. చైతు ఆమె జాకెట్ కి జిప్ పెడుతూ క్యూట్ గా కనిపించారు. ఆ పిక్ చూసి క్యూట్ కపుల్ అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు.




ఫైనల్లీ ప్రభాస్ స్పిరిట్ మొదలయ్యింది
Loading..