పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ స్పిరిట్ నేడు ఆదివారం ఘనంగా ప్రారంభమైయింది. ఈ ముహూర్త వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై క్లాప్ కొట్టడం ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ గా అలరించింది.
పాన్-ఇండియా పవర్‌హౌస్ ట్యాలెంట్ ని ఒకచోట చేర్చి మొదటి షూటింగ్ షెడ్యూల్ ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పటికే సెన్సేషనల్ హ్యాట్రిక్ హిట్‌లను అందించిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ను ఒక పల్స్-పౌండింగ్, పాన్-వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా బ్లాక్ బస్టర్ యానిమల్‌లో తన నటనతో ఆకట్టుకున్న త్రిప్తి దిమ్రి, ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా నటించనుంది. ఈ కొత్త జోడీ వెండితెరపై కొత్త ఎనర్జీని తీసుకురానుంది. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, ప్రముఖ నటి కాంచన కీలక పాత్రల్లో కనిపిస్తారు.
ప్రభాస్ పుట్టినరోజున నిర్మాతలు ఇటీవల ఒక ప్రత్యేకమైన సౌండ్-స్టోరీ ఆడియో టీజర్‌ను ఆవిష్కరించారు.ఎటువంటి విజువల్స్ లేనప్పటికీ ఈ వీడియోకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. స్పిరిట్‌ను ప్రపంచవ్యాప్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ గా రూపొందిస్తున్నారు. తొమ్మిది భాషలలో విడుదల చేయబోతున్నారు.
మ్యాసీవ్ స్కేల్, యూనివర్సల్ కథనం, భారీ యాక్షన్ ఈ సినిమాను మరింత విశేషంగా నిలబెట్టబోతున్నాయి. కెమెరాలు రోల్ అవుతున్నాయి. కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రభాస్ ఈజ్ బ్యాక్. స్పిరిట్ స్క్రీన్‌ను వెలిగించడానికి సిద్ధంగా ఉంది.




అనిల్ రావిపూడి బర్త్ డేకి మెగాస్టార్ గిఫ్ట్
Loading..