Advertisementt

అనిల్ రావిపూడి బర్త్ డేకి మెగాస్టార్ గిఫ్ట్

Sun 23rd Nov 2025 04:13 PM
chiranjeevi   అనిల్ రావిపూడి బర్త్ డేకి మెగాస్టార్ గిఫ్ట్
Megastar gift for Anil Ravipudi birthday అనిల్ రావిపూడి బర్త్ డేకి మెగాస్టార్ గిఫ్ట్
Advertisement
Ads by CJ

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడికి ఒక అందమైన వాచ్‌ని గిఫ్ట్ గా అందించారు. కేక్ కట్ చేసి బర్త్ డే ని సెలబ్రేట్ చేశారు. చిరంజీవి గారు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ గిఫ్ట్, హృదయపూర్వక శుభాకాంక్షలు అనిల్ రావిపూడికి మోస్ట్ మోమరబుల్ మూమెంట్స్ గా నిలిచాయి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకరవరప్రసాద్ గారు తెరకెక్కుతోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ క్రాస్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా మ్యూజిక్ కి కొత్త బెంచ్‌మార్క్‌ క్రియేట్ చేసింది నెలకొల్పింది.

చిరంజీవి తన సిగ్నేచర్‌ చార్మ్‌, ఎక్స్ప్రెషన్స్‌, ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌ మూవ్స్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ పాటకు వస్తున్న అద్భుతమైన స్పందనతో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఆకాశాన్ని తాకుతున్నాయి. మన శంకరవర ప్రసాద్‌ గారు 2026 సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల కానుంది.

Megastar gift for Anil Ravipudi birthday:

Chiranjeevi Special Birthday Gift To Anil Ravipud

Tags:   CHIRANJEEVI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ