అవును బిగ్ బాస్ అంతా మోసమే. బిగ్ బాస్ ని చూసేవాళ్ళు, ఫాలో అయ్యేవాళ్లంతా పిచ్చోళ్ళు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వినబడుతున్న కామెంట్స్. కారణం ఏమి లేదు. బిగ్ బాస్ స్క్రిప్టెడ్. అది రియాలిటీ షో కాదు. బిగ్ బాస్ ని టీవీలో కన్నా ముందే బిగ్ బాస్ టీం లీకులతో న్యూస్ లు ఇచ్చేస్తుంది. అదంతా ఒక ఎత్తు ఆడియన్స్ అనుకున్నది ఒకటైతే బిగ్ బాస్ యాజమాన్యం చేస్తుంది మరొకటి.
ఏమైనా అంటే ఇది రణరంగం కాదు చందరంగం అంటారు. సీజన్ 9 మాత్రం ఆడియన్స్ ఊహలకు అతీతముగా కాదు బిగ్ బాస్ స్టార్ మా కలిసి ప్రేక్షకులను మోసం చేసేలా ఉంది అంటున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు. వైల్డ్ కార్డు ఎంట్రీల కోసం స్ట్రాంగ్ అనుకున్న శ్రీజ ను ఎలిమినేట్ చేసారు. ఆమె ఎలిమినేషన్ ఫేక్ అనేసరికి భరణి తో పాటుగా రీ ఎంట్రీ ప్లాన్ చేసి ఆ అమ్మాయిని మళ్ళీ మోసం చేసారు.
ఆతర్వాత దివ్య ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటే ఆ స్థానంలో నిఖిల్ ని బలి పశువును చేసారు. ఈ 11 వ వారం మళ్లీ తక్కువ ఓట్స్ తో దివ్య నిఖిత డేంజర్ జోన్ లో నిలబడితే.. మళ్లీ దివ్యను సేవ్ చేసారు, తనూజ పై రెచ్చిపోయిన దివ్య ని హౌస్ లో ఉంచితే కంటెంట్ వస్తుంది, టిఆర్పి పెరుగుతుంది అని లాస్ట్ మినిట్ లో దివ్య ఎలిమినేషన్ ఆపేసారు.
దివ్య ఎలిమినేట్ అనే సంకేతాలు వచ్చేసాయి, ఆడియన్స్ కూడా అదే అనుకున్నారు. రివ్యూవర్స్ చెప్పేసారు దివ్య ఎలిమినేట్ అని. అటు యాజమాన్యం కూడా అంతా రెడీ అయ్యి చివరి నిమిషంలో దివ్య ని ఎలిమినేట్ చెయ్యలేదు అనే వార్తలు బుల్లితెర ఆడియన్స్ కు చిరాకు తెప్పించాయి.




రొమాంటిక్ గా చైతూకి శోభిత విషెస్
Loading..