యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో మోస్ట్ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న డ్రాగన్(వర్కింగ్ టైటిల్) చిత్రం రిపబ్లిక్ డే అంటే జనవరి 26 కి వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. కారణం డ్రాగన్ షూటింగ్ ఇంకా చాలా అంటే చాలా మిగిలే ఉంది. 45 రోజుల లాంగ్ షెడ్యూల్ కోసం విదేశాలకు టీమ్ పయనమవ్వబోతుంది.
ఇదంతా చూసి ఎన్టీఆర్-నీల్ లు ఏమి ట్విస్ట్ ఇవ్వరు కదా, ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు, అందుకే ప్రశాంత్ నీల్ డ్రాగన్ నుంచి ఎన్టీఆర్ లుక్ కానీ అప్ డేట్ కానీ వదలడం లేదు, అందులో ఈమధ్యన ఓ సీనియర్ యాక్టర్ ని తీసేసి ఆ ప్లేస్ లోకి బిజూ మీనన్ ని తీసుకొచ్చారు, అంటే ఆ సీనియర్ యాక్టర్ సీన్స్ మొత్తం పక్కనపడేసి మళ్లీ బిజూ మీనన్ తో షూట్ చెయ్యాలి.
సో మైత్రి మూవీస్ వారు మాటిచ్చినట్టుగా డ్రాగన్ చిత్రం రిపబ్లిక్ డే కి రావడం ఇంపాజిబుల్. మరి ఆ కొత్త డేట్ అయినా లేదంటే కనీసం ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూల్ గా ఉంటారు. లేదంటే వాళ్ళు ఆందోళపడిపోతారు.




BB 9: భరణి వల్లే దివ్య కి తనూజ కి గొడవ 
Loading..