బిగ్ బాస్ సీజన్ 9 లో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఇప్పటివరకు ఏది అంటే అది నిన్న శుక్రవారం ఎపిసోడ్ అనే చెప్పాలి. భరణి కోసం పడి చచ్చిపోయే తనూజ-దివ్య మద్యన తార స్థాయిలో గొడవ జరిగింది. ఆ గొడవలో ఎవ్వరిది తప్పు అంటే ఇద్దరూ తగ్గలేదు, ఒకరి ప్రొఫెషన్ ను ఒకరు అగౌరవపరుచుకున్నారు, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా పర్సనల్ కారణాలతో కొట్టుకున్నారు.
దీని మొత్తానికి కారణం భరణి అంటున్నారు నెటిజెన్స్. తనూజ కి భరణి నాన్న బాండింగ్, దివ్య కి అన్న బాండింగ్. వీరి మధ్యలో ఈగో లేకపోతె ఏది లేదు. కానీ భరణి వెనకపడుతుంది దివ్య అని తనూజ అంటే, నువ్వు మనుషులను వాడుకున్నావ్ అంటూ దివ్య మాట్లాడిన తీరు చూసి ఇద్దరూ కేవలం భరణి గారి గురించి ఒకరిపై ఒకరు ఇంతిలా ద్వేషం పెంచుకున్నారా అనేలా ఉంది.
అటు భరణి దివ్య దగ్గర తనూజ గురించి, తనూజ దగ్గర దివ్య గురించి మాట్లాడడంతో వారిద్దరూ ఒక్కరిపై ఒకరు పగ పెంచుకున్నారు. ఒకసారి ఈ గొడవ వల్లే ఆయన్ను ఆడియన్స్ బయటికి పంపేశారు, మళ్లీ ఆయన్ను లాగి లాగి తనూజ, దివ్య గొడవపడటం ఎవ్వరికి అర్ధం కావడం లేదు.
మరోపక్క దివ్య తనూజ ని నీ అసలు రంగు బయటపెట్టడానికి హౌస్లోకి వచ్చా అంటే.. అవును బయట సరిపోక లోపలికొచ్చావ్ అంటూ తనూజ అమ్మో ఒకొనొక సందర్భంలో దివ్య, తనూజ కొట్టుకుంటారేమో అనిపించేతగా గత రాత్రి ఎపిసోడ్ లో వీరిద్దరూ గొడవపడ్డారు.




5000 కోట్లతో అంబానీ పెళ్లి రేంజులో
Loading..