Advertisementt

5000 కోట్లతో అంబానీ పెళ్లి రేంజులో

Sat 22nd Nov 2025 12:11 PM
netra mantena  5000 కోట్లతో అంబానీ పెళ్లి రేంజులో
Netra Mantena wedding 5000 కోట్లతో అంబానీ పెళ్లి రేంజులో
Advertisement
Ads by CJ

ప్ర‌పంచ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి కోసం చేసిన ఖ‌ర్చు సుమారు 5000 కోట్లు. ఇది సుమారు 600 మిలియ‌న్ డాల‌ర్ల‌కు స‌మానం. 0.6 బిల‌య‌న్ డాల‌ర్లుగాను చెబుతారు. భార‌త‌దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత కాస్ట్ లీ పెళ్లి ఇది. ఇప్పుడు మ‌ళ్లీ ఆ రేంజు పెళ్లి రాజ‌స్థాన్ ఉద‌య్ పూర్ ప్యాలెస్ లో జ‌రుగుతోంది.

న‌వంబ‌ర్ 21 నుంచి మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుక‌లు జ‌రుగుతున్నాయి. ఇది ఫార్మాసూటికల్ దిగ్గ‌జాలు ప‌ద్మ‌జ మంతెన - రామ‌రాజు మంతెన‌ల కుమార్తె నేత్రా మంతెన వివాహం. ఆమెను రెస్టారెంట్ల నిర్వ‌హ‌ణలో టెక్ దిగ్గ‌జంగా పాపుల‌రైన వంశీ గాదిరాజు పెళ్లాడుతున్నాడు. నేత్రా మంతెన కుటుంబం భార‌త‌దేశం స‌హా అమెరికా, స్విట్జ‌ర్లాండ్ లో ఫార్మా ఆర్ అండ్ డి వ్య‌వ‌స్థ‌ల్ని ర‌న్ చేస్తోంది. ప్ర‌పంచ దేశాల్లో ఫార్మా దిగ్గ‌జాలుగా పాపుల‌ర‌య్యారు.

ఇప్పుడు ఈ అంగ‌రంగ వైభ‌వ‌మైన‌ పెళ్లి వేడుక కోసం 3000 - 5000 కోట్ల రేంజులో ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ పెళ్లి కోసం ఏకంగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియ‌ర్ ట్రంప్ త‌న గాళ్ ఫ్రెండ్ తో దిగొచ్చాడు. జెన్నిఫ‌ర్ లోపేజ్, జ‌స్టిన్ బీబ‌ర్ లాంటి పాప్ దిగ్గ‌జాలు పెళ్లిలో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్నారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం ఈ పెళ్లి వేడుక‌లో ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో అల‌రించేందుకు ఒక‌రొక‌రుగా అడుగుపెడుతున్నారు. అనంత్ అంబానీ పెళ్లి త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజులో సంద‌డి సాగుతోంది.

Netra Mantena wedding:

Who are Netra Mantena and Vamsi Gadiraju

Tags:   NETRA MANTENA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ