Advertisementt

మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య క్రేజీ కామెంట్స్

Sat 22nd Nov 2025 03:22 PM
mokshagna  మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య క్రేజీ కామెంట్స్
Mokshagna debut: Nandamuri Balakrishna reiterates clarity మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య క్రేజీ కామెంట్స్
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహ వారసుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీ కి ఇంట్రడ్యూస్ అయ్యే సమయం కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పడం కష్టం. ఇదిగో మోక్షు ఎంట్రీ, అదిగో మోక్షు సినిమా అనడమే కానీ ఇప్పటివరకు ఆ శుభవార్త రావట్లేదు. గత ఏడాది మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఎనౌన్సమెంట్ వచ్ఛి అది అక్కడే ఆగిపోయింది. ఇప్పటివరకు అసలు ముచ్చట జరగడం లేదు. 

ఆతర్వాత బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 లో మోక్షజ్ఞ గెస్ట్ రోల్ ద్వారా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతాడని టాక్ నడిచింది. ఇప్పుడు మరోసారి అంటే అఖండ తాండవం రిలీజ్ ముందు మోక్షజ్ఞ ఎంట్రీ పై మరోసారి వార్తలు మొదలయ్యాయి. కారణం అఖండ-2 ప్రమోషన్లలో భాగంగా ఒక నేషనల్ ఛానెల్‌తో బాలయ్య మాట్లాడుతూ.. ఒక ఆసక్తికర ప్రకటన చేశారు.

ఆదిత్య 999 ప్రో మ్యాక్స్ పేరుతో ఆదిత్య 369 సీక్వెల్ చేయనున్నట్లుగా ఆ ఇంటర్వ్యూలో బాలయ్య వెల్లడించారు. అంతేకాక అందులో తన కొడుకు మోక్షజ్ఞ కూడా నటిస్తాడని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తన కొడుకుతో కలిసి ఆదిత్య 369 సీక్వెల్ చేస్తానని బాలయ్య గతంలోనూ ప్రకటించారు. సో ఆదిత్య 999 ప్రో మ్యాక్స్ మొదలయ్యే క్షణం కోసం నందమూరి అభిమానులు వెయిట్ చెయ్యాల్సిందే. 

Mokshagna debut: Nandamuri Balakrishna reiterates clarity:

Akhanda 2 Release - Mokshagna News Starts

Tags:   MOKSHAGNA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ