ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఏడాదికాలంగా అట్లీతో సైన్స్ ఫిక్షన్ మూవీ కోసం కఠినంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప, పుష్ప 2 తర్వాత బన్ని ఎంపిక చేసుకున్న ఈ వైవిధ్యమైన స్క్రిప్టు అతడి స్థాయిని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఇది భారతీయ సినీపరిశ్రమలో మరో ప్రయోగాత్మక చిత్రం కాబోతోంది. ఇందులో దీపిక పదుకొనే కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్ కూడా టీమ్ లో చేరిందని కథనాలొచ్చాయి. సన్ పిక్చర్స్ రాజీ అన్నదే లేకుండా ఈ సినిమాకి పెట్టుబడులను సమకూరుస్తోంది.
అయితే అల్లు అర్జున్ ఇలాంటి బిజీ షెడ్యూళ్ల నడుమ చిన్న విరామం తీసుకుని కుటుంబంతో దుబాయ్ వెకేషన్ కి వెళ్లారని తెలుస్తోంది. అల్లు అర్హ బర్త్ డే(21 నవంబర్)ని ఎగ్జోటిక్ లొకేషన్ లో ప్లాన్ చేసిన బన్ని ఈవెంట్ ని ముగించి తిరిగి హైదరాబాద్ కి వస్తారు. సోమవారం నాడు అట్లీతో మూవీ సెట్స్ లో చేరతాడు. తాజా షెడ్యూల్ లోకి బన్నీతో పాటు మృణాల్ కూడా చేరుతుందని తెలిసింది.
ప్రస్తుతం దుబాయ్ లో స్నేహా రెడ్డి, అయాన్, అర్హలతో అల్లు అర్జున్ విహారయాత్రను ఆస్వాధిస్తున్నారు. ఐదు రోజుల యాత్ర బన్నికి చాలా రిలీఫ్‌నిస్తుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది పూర్తి చేసి 2027 సమ్మర్ నాటికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే అధికారికంగా రిలీజ్ తేదీని టీమ్ ప్రకటించాల్సి ఉంటుంది.




BB 9: కొట్టుకునే వరకు వెళ్లిన తనూజ-దివ్య
Loading..