బిగ్ బాస్ సీజన్ 9 లో భరణి కి తనూజ కి మధ్యన కూతురు-తండ్రి బాండింగ్ చాలా క్యూట్ గా ఉండేది. మూడు వారాల తర్వాత దివ్య వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి భరణి పక్కన చేరి ఆయన ఆట కన్నా ఎక్కువగా దివ్య వలన భరణి ఆటకు ఎఫెక్ట్ అయ్యింది. దివ్య వల్ల తనూజ కి భరణి కి మనస్పర్థలు రావడం, భరణి ఎక్కువగా దివ్య తో క్లోజ్ గా ఉండడం, మిగతా హౌస్ మేట్స్ బాండింగ్ అంటూ నామినేట్ చెయ్యడం, ఆడియన్స్ ఆ బాండింగ్స్ వలనే భరణి ని బయటికి పంపించెయ్యడం, బిగ్ బాస్ మళ్లీ భరణిని ఈ ఎంట్రీ అంటూ హౌస్ లో చాలా డ్రామా నే నడిచింది.
భరణి బయటికెళ్లి లోపలి వచ్చాక దివ్య కి తనూజాకి దూరంగా ఉన్నా దివ్య మాత్రం భరణిని వదలడం లేదు. తనూజ దూరంగా ఉంటుంది. అయినప్పటికీ దివ్య-తనూజ మధ్యలో భరణి రోస్ట్ అయిపోతున్నాడు. సంజన కూడా అదే చెప్పింది. ఈ వారం కూడా తనూజ కాలికి భరణి మందు రాస్తుంటే దివ్య కోపగించుకోవడం, భరణి కూతురు దివ్య తో దూరంగా ఉండమని హింట్ ఇవ్వడం, తనూజ ని పొగడడం అన్ని దివ్య కి కడుపు మంట కలిగించేవే.
అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం దివ్య తనూజ ని తప్పించడంతో మొదలైన గొడవ పరాకాష్టకు చేరింది. నువ్వు ఎక్కువ వాగుకు అంటే నువ్వు ఎక్కువ వాగకు, నువ్వు పో అంటే నువ్వు పో అంటూ ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్లడం.. దివ్యను కొంతమంది హౌస్ మేట్స్ కంట్రోల్ చేస్తే, మరికొందరు తనూజను కంట్రోల్ చేసిన ప్రోమో అయితే సెన్సేషనల్ గా మారింది.
ఈ ప్రోమో చూస్తే దివ్య-తనూజ మధ్యలో భరణి వల్ల ఏర్పడిన కోల్డ్ వార్ ఇప్పుడు మెల్లగా ఓపెన్ అయ్యిపోయింది అనే చెప్పాలి.





రెబల్ సాబ్ తో హైప్ క్రియేట్ చేసారుగా..
Loading..