Advertisementt

రెబల్ సాబ్ తో హైప్ క్రియేట్ చేసారుగా..

Fri 21st Nov 2025 02:39 PM
prabhas  రెబల్ సాబ్ తో హైప్ క్రియేట్ చేసారుగా..
The first song Rebel Saab from Rebel Star Prabhas రెబల్ సాబ్ తో హైప్ క్రియేట్ చేసారుగా..
Advertisement
Ads by CJ

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. రెబల్ సాబ్ అంటూ క్రేజీ పోస్టర్ తో ఈ నెల 23న ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రాజా సాబ్ ఫస్ట్ సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ప్రభాస్ స్టైలిష్ గా, వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారు.

మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమా కోసం క్రేజీ సాంగ్స్ కంపోజ్ చేశారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న రాజా సాబ్ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా రాజా సాబ్ ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. 

మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

The first song Rebel Saab from Rebel Star Prabhas:

Prabhas Raja Saab First Single update

Tags:   PRABHAS
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ