తీగ లాగితే డొంక కదిలిన చందంగా ఇప్పుడు బాలీవుడ్ కూసాలు కదిలిపోతున్నాయ్. దుబాయ్ పార్టీలో డ్రగ్స్ సరఫరా చేసిన షేక్ కొంపలు ముంచుతున్నాడు. పార్టీలో ఫుల్ గా చిల్ చేసి మత్తులో జోగిన టాప్ హిందీ సెలబ్రిటీలు అతడి వల్ల గడగడలాడుతున్నారు. ఏ రోజు నార్కోటిక్స్ అధికారులు తమను అరెస్ట్ చేస్తారోననే భయాందోళనలు ఇప్పుడు హిందీ సినీసెలబ్రిటీలను చుట్టుముట్టాయని తెలుస్తోంది.
ఇందులో ఇద్దరు ప్రముఖ కథనాయికల పేర్లు ఇప్పటికే రివీలయ్యాయి. తాజాగా షేక్ సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ ఓర్హాన్ అవ్రతమణి పేరును ప్రస్థావించినట్టు కథనాలొస్తున్నాయి. ఓర్రీకి ఇప్పటికే నార్కోటిక్స్ బ్యూరో సమన్లు పంపింది. కానీ అతడు తన న్యాయవాది ద్వారా 25 నవంబర్ వరకూ సమయం కావాలని నోట్ పంపాడు. అతడు గురువారం నాటి విచారణకు డుమ్మా కొట్టాడు.
ఇది దాదాపు 252 కోట్ల విలువైన మెఫిడ్రిన్ తయారీ, పంపిణీ చేసిన డ్రగ్ డాన్ తో ముడిపడిన వ్యవహాం గనుక అతడితో సంబంధాలున్న ప్రతి బాలీవుడ్ సెలబ్రిటీ గుండెల్లో దడ పుట్టుకొచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రూ. 252 కోట్ల మెఫెడ్రోన్ స్వాధీనం కేసులో కీలక నిందితుడైన మహ్మద్ సలీం మొహమ్మద్ సుహైల్ షేక్ విచారణలో చాలా విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికి చిన్న చేపల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. మునుముందు సొర చేపల పేర్లు కూడా బయటకు వస్తాయని అందరూ చెబుతున్నారు. ఈ కేసులో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సహా పలు రంగాలకు చెందిన టాప్ సెలబ్రిటీలు పార్టీలో చిల్ చేసిన వారిలో ఉన్నారని చెబుతున్నారు. దుబాయ్ లో జరిగిన పార్టీలో సినీసెలబ్రిటీలతో కలిసి గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం బంధువు డోలా కూడా ఉన్నాడని చెబుతున్నారు. అయితే కథానాయికలతో పార్టీలో చిల్ చేసాడా? అంటూ ఇప్పుడు కొత్త సందేహాలు రాజుకున్నాయి. లావిష్ అలియాస్ దుబాయ్ షేక్ విచారణలో ఇంకా ఏం నిజాలు చెబుతాడోననే ఆందోళన బాలీవుడ్ వర్గాల్లో ఉందని తెలుస్తోంది. గత సంవత్సరం మహారాష్ట్రలోని సాంగ్లీలోని ఒక డ్రగ్ ఫ్యాక్టరీ నుండి రూ.252 కోట్ల మెఫెడ్రోన్ స్వాధీనం కేసులో షేక్‌ను అరెస్ట్ చేసాక ఇదంతా మొదలైంది.





ప్రముఖ స్టూడియోలకు బల్దియా షాక్
Loading..