అఖిల్ రాజ్-తేజస్విని కాంబో లో సాయిలు కంభంపాటి చిన్న బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. క్రేజీ ప్రమోషన్స్, అంతకు మించి దర్శకుడు సాయిలు కంభంపాటి సినిమాకి నెగటివ్ టాక్ వస్తే అమీర్ పేట్ లో అర్ధనగ్నంగా తిరుగుతాను అంటూ బిగ్ స్టేట్మెంట్ ఇవ్వడం, రిలీజ్ కి ఒకరోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ తో హడావిడి చెయ్యడం వంటి విషయాలు ఈ చిత్రంపై మంచి క్యూరియాసిటీని కలిగించాయనడంలో సందేహం లేదు.
పెయిడ్ ప్రీమియర్స్ సాహసం చేసిన ఈ చిన్న సినిమాకి ప్రీమియర్స్ షోస్ పూర్తయ్యేసరికి సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. రాజు వెడ్స్ రాంబాయి ఒక్కసారి హ్యాపీ గా చూసేయండి, దర్శకుడు ఫుల్ గా బట్టలు వేసుకుని తిరగొచ్చు. ఈ సినిమా క్లైమాక్స్ ని ఏం ప్లాన్ చేసారండి.. దీని కోసమయినా సినిమా చూడాలి, లవ్ స్టోరీని డైరెక్టర్ హ్యాండిల్ చేసిన తీరు, అఖిల్ రాజ్ - తేజస్విని యాక్టింగ్, క్లైమాక్స్ అన్ని రాజు వెడ్స్ రాంబాయి కి ప్లస్ పాయింట్స్.
స్లో నేరేషన్, అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాల మినహా సినిమా గుడ్, హ్యాపీ గా థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడొచ్చు అంటూ ప్రీమియర్స్ చూసిన వారు సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్స్ చూసి చిన్న సినిమా పెద్ద హిట్టు కొట్టింది.
అన్ని వైపులా నుంచి రాజు వెడ్స్ రాంబాయి కి వస్తున్న పాజిటివిటీని ఇంకా ప్రోపర్ గా ఆడియన్స్ లోకి తీసుకువెళితే సినిమాని ఆపడం ఎవ్వరి తరం కాదు అంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు.





అఖండ 2 పవర్ ఫుల్ ట్రైలర్ కి టైమ్ ఫిక్స్
Loading..