బిగ్ బాస్ సీజన్ 9 లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడిచింది. ఫ్యామిలీ వీక్ లో తనూజ సిస్టర్ వస్తే ఆమెకు పసుపు కుంకుమ పెట్టి ఆశీర్వదించింది. అలాగే పవన్ తల్లి వస్తే ఆమె అందరితో బావుంది. ఇక దివ్య మదర్ అయితే కామెడీ గా రచ్చ చేసింది. సుమన్ శెట్టి వైఫ్ తనూజ ను బ్లేమ్ చేసింది. ఇక కళ్యాణ్ తల్లి రాగానే కళ్యాణ్ ఫుల్ గా ఎమోషనల్ అయ్యాడు. రీతూ తల్లి మాత్రం టాస్క్ బాగా ఆడి కెప్టెన్ అవ్వమంది.
అదే మాదిరి భరణి కుమార్తె కూడా తనూజ-భరణి బాండింగ్ బావుంది అని చెబుతూనే దివ్య కి దూరంగా ఉండమని ఇండైరెక్ట్ సంకేతాలు ఇచ్చింది. అంతేకాకుండా భరణి ని కెప్టెన్ గా చూడాలని కోరింది. సంజన కొడుకు, కూతురు, భర్త హౌస్ లోకి వచ్చారు. అలాగే ఇమ్మాన్యుయేల్ తల్లి హౌస్ లో అడుగుపెట్టింది. ఆమె సరదాగా అందరిని నవ్వించింది. అయితే ఈ వీక్ లో ఎవరు కెప్టెన్ అయ్యారనే విషయంలో అందరిలో ఆసక్తి కనిపిస్తుంది.
గత వారం పోరాడి కెప్టెన్సీ ని పొందిన తనూజ కు ఫ్యామిలీ వీక్ లో గంట ఫ్యామిలీతో గడిపే సమయం చిక్కింది. ఇక ఈవారం కెప్టెన్సీ టాస్క్ గెలిచి రీతూ చౌదరి కెప్టెన్ అయినట్లుగా తెలుస్తుంది. రీతూ టాస్క్ విషయంలో బెస్ట్ ఇచ్చినా పవన్ దగ్గర ఆమె ఆగిపోవడం మైనస్ అయ్యింది.
అసలు రీతూ చౌదరి టాప్ 5 కంటెస్టెంట్. కానీ ఆమె ఆట డిమోన్ పవన్ చుట్టూ తిరగడమే ఆమెకు మైనస్ అవుతుంది. ఎట్టకేలకు ఈ వీక్ లో ఆమె కెప్టెన్సీ బ్యాండ్ ని దక్కించుకుంది.





చిన్న సినిమా - బిగ్ హిట్
Loading..