కొన్ని కోట్లు ఖర్చు పెట్టి దర్శకుడు రాజమౌళి #GlobeTrotter అంటూ పెద్ద ఈవెంట్ ని వారణాసి కోసం రామోజీ ఫిలిం సిటీలో చేసారు.. ఆ ఈవెంట్ ఎంతవరకు రీచ్ అయ్యిందో, వారణాసి చిత్రానికి ఎంత ఎక్కువ హైప్ క్రియేట్ అయ్యిందో తెలియదు కానీ.. బీజేపీ వాళ్ళు మాత్రం ఆ ఈవెంట్ లో రాజమౌళి చేసిన కామెంట్స్ ని టార్గెట్ చేస్తూ వారణాసికి ఉచిత పబ్లిసిటీ ఇస్తున్నారు.
బిజెపి నేతలు బండి సంజయ్, మాధవి, తమిళనాడు, కర్ణాటక బీజేపీ సహ ఇంచార్జి పొంగులేటి సుధాకరరెడ్డి, రాజా సింగ్ లాంటి వాళ్ళు రాజమౌళి హనుమంతుడిపై అలాంటి కామెంట్స్ చెయ్యడమేమిటి, దేవుణ్ణి కించపరుస్తావా, నీ సినిమాలు నువ్వు చేసుకో దేవుణ్ణి నిందించే హక్కు నీకెవరిచ్చారు, ముందు క్షమాపణ చెప్పు అంటూ వారణాసి ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడిన మాటలను హైలెట్ చేస్తున్నారు.
నిజంగా కోట్లు ఖర్చు పెట్టినా రాని పబ్లిసిటీ ని బీజేపీ వాళ్ళు రాజమౌళికి అందిస్తున్నారు. ఇండియా వైడ్ గా వారణాసి గురించి తెలియని వాళ్ళు కూడా బీజేపీ నేతల టార్గెట్ వలన వారణాసి గురించి మాట్లాడుకోవడం నిజంగా వారణాసికి ప్లస్ అయ్యింది అనే చెప్పాలి.





రజనీ ఫ్యాన్స్కి చెప్పు చూపించిన ఖుష్బూ
Loading..