సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధానపాత్రలో కమల్ హాసన్ నిర్మించనున్న తలైవర్ 173 ని అధికారికంగా ప్రకటించిన కొద్దిరోజులకే దర్శకుడు సుందర్ సి వైదొలగడం పెద్ద ట్విస్టు. ఈ ట్విస్ట్ ఊహించని రజనీ ఫ్యాన్స్ నిజంగా ఖంగు తిన్నారు. కొందరు సుందర్ సి పోవడంతో చాలా మేలు జరిగిందని వ్యాఖ్యానించగా, చాలా మంది రజనీతో సుందర్ సి విబేధాల గురించి సోషల్ మీడియాల్లో ప్రస్థావిస్తున్నారు.
రజనీ సినిమాలో ఒక ఐటమ్ నంబర్ లో ఖుష్బూ డ్యాన్స్ చేయాలని రజనీ కోరడం వల్లనే సుందర్ సి దీని నుంచి తప్పుకున్నాడంటూ ఒక నెటిజన్ అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసాడు. సోషల్ మీడియాల్లో ఖుష్బూను ఉద్ధేశించి దారుణమైన ట్రోల్స్ జరుగుతుంటే అది తట్టుకోలేక సదరు నటీమణి ప్రతి దాడికి దిగారు. ఒక అభిమాని కథ కథనంతో ఒప్పించలేకపోయిన ఔట్ డేటెడ్ సుందర్ సిని చెత్త బుట్టలో వేయాల్సిందేనా? అని కూడా ప్రశ్నించాడు. ఇలాంటి దారుణమైన ట్రోల్స్ ని తట్టుకోలేకపోయిన ఖుష్బూ.. రజనీ ఫ్యాన్స్ కి డైరెక్ట్ ఎటాక్ ఇచ్చారు.
నా చెప్పు సైజు 41.. దెబ్బలకు సిద్ధంగా ఉన్నారా? అంటూ రజనీ ఫ్యాన్స్‌పై ఖుష్బూ విరుచుకుపడ్డారు. ఒక అభిమానితో ఈ సినిమా దర్శకుడిగా మీ కుటుంబం నుంచి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేస్తామని కూడా ఖుష్బూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మొత్తానికి సోషల్ మీడియా శత్రువులతో ఖుష్బూ భీకరమైన పోరాటం సాగిస్తున్నారు. ఇది అగ్లీ ఫైట్ గా మారింది.





NC24 - థ్రిల్లింగ్ BTS వీడియో 
Loading..