నాగ చైతన్య #NC24 తో థ్రిల్ చేయబోతున్నారు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పార్ష్ శ్రీవాస్తవ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా NC 24 నుంచి విడుదల చేసిన స్ట్రైకింగ్ & ఇమర్సివ్ BTS మేకింగ్ వీడియో సినిమా భారీ స్కేల్, విజన్, అంబిషన్‌ను చూపించింది.
నాగేంద్ర కుమార్ తంగాల కొన్ని ఎకరాల విస్తీర్ణంలో వందలాది టెక్నీషియన్స్ కష్టపడి నిర్మించిన భారీ సెట్ విజువల్ ఎక్స్‌లెన్స్‌ను ప్రతిబింబిస్తోంది. వీడియోలో నాగ చైతన్య ఫిజికల్, యాక్షన్ ట్రైనింగ్ కట్టిపడేసింది. ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జుజి మాస్టర్ పర్యవేక్షణలో ఆయన చేసిన ట్రైనింగ్, పాత్ర కోసం తీసుకున్న ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతంగా వున్నాయి.
మేకింగ్ గ్లిమ్ప్స్‌లో అనేకమంది ఆర్టిస్టులు, పెర్ఫార్మర్లు పాల్గొన్న భారీ సీన్స్ ఆకట్టుకున్నాయి. సినిమా ఎలాంటి ఎపిక్ కాన్వాస్ మీద తీర్చిదిద్దబడుతోందో ఈ BTS వీడియో తోనే స్పష్టమవుతుంది.
నవంబర్ 23న నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది.





నేరస్తుడికి పాపులర్ లాయర్ సపోర్ట్ 
Loading..