iబొమ్మ నిర్వాహకుడు తెలంగాణ పోలీసులను కవ్వించిన కవ్వింపుని చాలా సీరియస్ గా తీసుకుని ఇమ్మడి రవి ని చాకచక్యంగా అరెస్ట్ చేసి కష్టడీలోకి తీసుకునేవరకు నిద్రపోలేదు. ఆ దెబ్బకి iబొమ్మ డొంక కదలడమే కాదు రవి చేతే iబొమ్మ ని క్లోజ్ చేయించారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు తెలంగాణ పోలీసులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఈ సైబర్ నేరస్తుడిని పలువురు ప్రేక్షకులు సపోర్ట్ చెయ్యడమే కాకుండా ఏకంగా లీడింగ్ లాయర్ iబొమ్మ రవి అరెస్ట్ ను వ్యతిరేఖిస్తూ రవిని బయటికి తీసుకొచ్చే వరకు నిద్రపోను అని చెప్పడమే ఇప్పుడు హాట్ టాపిక్. పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవి తరపున ప్రముఖ లాయర్ సలీం వాదించనున్నారు. ఈయనే జగన్ కోడికత్తి అలాగే గులకరాయి కేసులో జగన్ తరపున వధించిన లాయర్.
ఇమ్మడి రవిని ఎలా అయితే చట్ట ప్రకారం అరెస్ట్ చేసినట్లే, అదే చట్ట ప్రకారం తాను ముద్దాయి రవి తరపున వాదించడానికి ముందుకు వచ్చానని.. ముద్దాయి హక్కుల కోసం వృత్తి ధర్మంగా ఫైట్ చేస్తానని సలీం చెబుతున్నారు. అంతేకాదు పోలీసులు హీరోలు అవ్వాలంటే విలన్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. అలాంటి విలన్ కి ఒక డేరింగ్ అండ్ డాషింగ్ లాయర్ దొరికితే ఎలా ఉంటుందో చూస్తారని సలీం ఛాలెంజ్ చేస్తున్నారు.
మరోపక్క ఇమ్మడి రవి పైరసీ చేసింది తప్పు అంటున్నారు, కానీ మాస్ జనాలు ఆయనికి రవికి మద్దతుగా నిలుస్తున్నారు. అతడిని హీరోలాగా భావిస్తున్నారు. దాని వల్లే ఈ కేసుకి ఇంత హైప్ వచ్చింది. రవి మా దేవుడు.. ఈ కేసు తీసుకొని గొప్ప పని చేశారు, థ్యాంక్యూ అంటూ నాకు పలువురు కృతఙ్ఞతలు తెలుపుతున్నారంటూ సలీం చెప్పడం విశేషం.





ఏం సాధించాడని ఈ రప్పా రప్పా
Loading..