ఏపీ కి ముఖ్యమంత్రి కాకముందు జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు జైలులో ఉండి వచ్చిన రాజకీయ నాయకుడు. ఆతర్వాత ఏపీ పాదయాత్ర తో ప్రజలను ఆకర్షించి ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సీఎం కుర్చీ ఎక్కిన జగన్ ఐదేళ్లపాటు తాను ముఖ్యమంత్రిని అందువలన తను పబ్లిక్ గా కోర్టుకి రాలెను అంటూ అక్రమాస్తుల కేసులో కోర్టు నుంచి వాయిదాలు తీసుకున్న జగన్ కి మాజీ స్థానంలోకి వచ్చాక నాంపల్లి సిబిఐ కోర్టు జగన్ కు షాకిచ్చింది.
ఈరోజు గురువారం ఖచ్చితంగా జగన్ ను కోర్టుకు హాజరవ్వాలని ఆదేశిలివ్వగా జగన్ మాత్రం తను ఉదయం 11-30 గంటలకు కోర్టుకు వస్తానని... ఆ తర్వాత 12-30 గంటలకు కోర్టు నుంచి వెళ్లిపోతానని చెప్పడమే కాదు తన అభిమానులకు ఇండైరెక్ట్ సంకేతాలు పంపించారు తనకు సపోర్ట్ గా రావాలని. తానేదో సాధించినట్టుగా కోర్టుకు హాజరవుతున్నాను, తనను ప్రొటెక్ట్ చేసేందుకు భారీగా అభిమానులు రావాలనే ఉద్దేశ్యంతో జగన్ అలా చేసారు.
బేగంపేట్ లో దిగిన జగన్ అక్కడి నుంచి కోర్టు కు వచ్చే నడుమ అభిమానులు రచ్చ చేసారు. జగన్ చుట్టు చేరి భారీ ర్యాలీ చేపట్టిన అభిమానులు.. ఆ ర్యాలీలో జగన్, కేటీఆర్ ఫ్లెక్సీలతో హల్చల్ చేశారు. అంతేకాకూండా 2029లో రప్పా రప్పా.. అంటూ జగన్ ఫ్యాన్స్ ప్లకార్డులు ప్రదర్శించడం హాట్ టాపిక్ గా మారింది.
దేశానికీ, రాష్ట్రానికి ఏదో సాధిస్తే అలా జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరైతే ఆయన అభిమానులు ఈ రకమయిన ప్రదర్శన చెయ్యడం నిజంగా ఆశ్చర్యకరం అంటూ అందరూ ఎద్దేవా చేస్తున్నారు.
మరోపక్క జగన్ కోసం ఇంకా ఇంతమంది అభిమానులు హైదరాబాద్ లోనే ఉన్నారు, ఏపీ నుంచి వచ్చారు. జగన్ కు జన సమీకరణ చాలా ఉంది అంటూ బ్లూ మీడియా మాత్రం పెద్ద ఎత్తున జగన్ కు భజన చేస్తుంది.





రాజా సాబ్ - ఇక నాన్ స్టాప్ అప్ డేట్స్ 
Loading..