బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంటర్ అయ్యేందుకు అగ్నిపరీక్షలో నెగ్గి మరీ అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల హౌస్ మేట్స్ అందరితో మంచి ర్యాపొ మైంటైన్ చెయ్యడమే కాదు తనూజ వెంట తిరుగుతూ ఆటలో తనని తాను షైన్ చేసుకుంటూ 11 వారాల పాటు నామినేషన్స్ లోకి వచ్చిన టాప్ కంటెస్టెంట్ తనూజ కి పోటీ ఇస్తూ ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ నే తొక్కేస్తున్నాడు.
ఇప్పుడు ఫ్యామిలీ వీక్ లోను కళ్యాణ్ పడాల తల్లి హౌస్ లోకి రావడమే పిల్లోడు ఎమోషనల్ అవడము, తనూజ తో కలిసి తల్లి తో మట్లాడడం తల్లితో భావోద్వేగానికి గురయిన వీడియోస్, తనూజ తో తల్లి గురించి చెబుతూ ఏడుస్తున్న వీడియోస్ ఇప్పుడు ట్విట్టర్ X లో ట్రెండ్ అవుతున్నాయి.
తనూజ కళ్యాణ్ వాళ్ళ అమ్మకు చీర పెట్టడం ఈ రోజు ఎపిసోడ్ లో హైలెట్ అయ్యింది. ఈ రోజు ఎపిసోడ్ మొత్తం కళ్యాణ్ చుట్టూ తిరగడంతో అలా ఓ కామనర్ సోషల్ మీడియా X లో ట్రెండ్ అవడం నిజంగా షాకిచ్చే విషయమే. ఫైనల్ గా తనూజ, ఇమ్మాన్యుయేల్ కి పోటీ ఇస్తూ టాప్ 3 లోకి కళ్యాణ్ ఉంటాడనేది చాలావరకు క్లారిటీ వచ్చేసింది.





వారణాసి కి బీజేపీ ఈ రేంజ్ పబ్లిసిటీనా 
Loading..