ఈ-ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ ను ప్రశ్నించేందుకు తెలంగాణ గవర్నర్ అప్రూవల్ ఇచ్చేసారు. ఇప్పటివరకు ఈ కేసులో తన విచారణ విషయంలో ధీమాలో ఉన్న కేటీఆర్ కు ఇది పెద్ద షాక్. ఈ-ఫార్ములా రేస్ కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఇప్పటికే రెండుసార్లు కేటీఆర్ ని విచారించింది.
అయితే కేటీఆర్ ప్రజాప్రతినిధి అయిన కారణంగా మరోసారి కేటీఆర్ ను విచారించేందుకు, ప్రాసిక్యూషన్, ఛార్జీ షీట్ దాఖలు చేసేందుకు ఏసిబి గవర్నర్ అనుమతి కోరింది. గత సెప్టెంబర్ లో ఏసీబీ పంపిన ఈ లేఖను పరిశీలించిన గవర్నర్ కేటీఆర్ ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ ఇప్పుడు ఇరుకునపడ్డారు.
నిన్నగాక మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘోరమైన ఓటమి చవి చూసిన కేటీఆర్ కు ఇప్పుడు ఈ-ఫార్ములా రేస్ కేసు కూడా బాగా డిస్టర్బ్ చేసేదిలా ఉంది.





కాంత ఓటీటీ డేట్ లాక్ 
Loading..