దుల్కర్ సల్మాన్-భాగ్యశ్రీ బోర్సే కాంబోలో తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన కాంత చిత్రం ఎన్నోసార్లు విడుదల వాయిదా వేసుకుంటూ చివరికి నవంబర్ 14 న భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో విడుదలైంది. అయితే కాంత చిత్రం తమిళనాట సక్సెస్ అయినా తెలుగు ప్రేక్షకులకు ఎక్కలేదు.
ఇక్కడ ప్రేక్షకులు, సినీ విమర్శకులు కూడా మిక్స్డ్ రివ్యూస్, మిక్స్డ్ రెస్పాన్స్ చూపించారు. దుల్కర్ సల్మాన్ నట విశ్వరూపం, భాగ్యశ్రీ బోర్సే లుక్స్ బావున్నా దర్శకత్వ లోపాలు కాంత కు ఎఫెక్ట్ అయ్యాయి. అయితే కాంత చిత్రం ఓటీటీ గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాంత చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ డీల్ తో సొంతం చేసుకోగా.. థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 12, 2025 నుంచి స్ట్రీమింగ్ లోకి తెచ్చే ఆలోచనలో నెట్ ఫ్లిక్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో థియేటర్స్ లో విడుదలైన నెల లోపే కాంత ఓటీటీలోకి వచ్చేస్తుందన్నమాట.




సినిమా ఇండస్ట్రీకి బిగ్ షాక్ 
Loading..