Advertisementt

సినిమా ఇండస్ట్రీకి బిగ్ షాక్

Thu 20th Nov 2025 10:48 AM
ibomma one  సినిమా ఇండస్ట్రీకి బిగ్ షాక్
iBomma one enters the picture సినిమా ఇండస్ట్రీకి బిగ్ షాక్
Advertisement
Ads by CJ

గత నాలుగు రోజులుగా సినిమా ఇండస్ట్రీని వణికించిన i బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ని తెలంగాణ పోలీసులు వల పన్ని పట్టుకోవడం పై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు. i బొమ్మ వెబ్ సైట్ ద్వారా కొత్త సినిమాలను ఆన్ లైన్ లో లీక్ చేసి లాభం కాదు వందల కోట్లు గడించిన రవి అరెస్ట్ అవడంపై నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. మరోపక్క i బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ ను ప్రేక్షకులు ఖండించడం హాట్ టాపిక్ అయ్యింది. 

ఇంతలోపే సినిమా ఇండస్ట్రీకి మరో బిగ్ షాక్ తగిలింది. అదే i బొమ్మ ను క్లోజ్ చేయించారు, ఇకపై సినిమా పైరసీ జరగదని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో i బొమ్మ వన్ అంటూ దానినుంచి సినిమాలు ప్రత్యక్షమవడం కలకలం సృష్టించింది. i బొమ్మ క్లోజ్ అయితేనేమి మేమున్నాం గా అంటూ i బొమ్మ వన్ రావడం నిజంగా షాకిచ్చే విషయమే. 

ఓ పక్క i బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ మరోపక్క i బొమ్మ వన్ ప్రత్యక్షం.. i బొమ్మ వన్ ని క్లిక్ చేస్తే.. కొత్త సినిమాలు కనిపించడమే కాదు అది మూవీ రూల్స్ కి కనెక్ట్ అవడం మళ్లీ కొత్త తలనెప్పికి దారితీసింది.  

iBomma one enters the picture:

iBomma one 

Tags:   IBOMMA ONE
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ