కొన్నేళ్లుగా చిన్న, మీడియం సినిమాలు విడుదలకు ముందే పెయిడ్ ప్రీమియర్స్ అంటూ కొద్దిగా ముందుగానే ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాయి. అందులో కొన్ని ప్రీమియర్స్ తో సక్సెస్ అయితే కొన్ని మాత్రం ప్రీమియర్స్ ఎఫెక్ట్ తో మినిమమ్ ఓపెనింగ్స్ తెచ్చుకోలేక చేతులెత్తేస్తున్నాయి.
ఇప్పుడు ఓ చిన్న సినిమా కూడా ఆ సాహసానికి పూనుకుంది. అదే రాజు వెడ్స్ రాంబాయి. అఖిల్ రాజ్-తేజస్విని కాంబో లో సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో రేపు నవంబర్ 21 న ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో క్లైమాక్స్ గురించి హైప్ క్రియేట్ చేస్తుంది చిత్ర బృందం.
ఇక ఇప్పుడు విడుదలకు ముందే అంటే గురువారం సాయంత్రమే పెయిడ్ ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఈ చిన్న చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఈరోజు హైదరాబాద్ లోని శ్రీరాములు, AAA థియేటర్స్ లో రాజు వెడ్స్ రాంబాయి పెయిడ్ ప్రీమియర్స్ తో పెద్ద సాహసానికి దిగింది.
మరి చిత్ర బృందానికి చాలా కాన్ఫిడెంట్ ఉంటేనే ఈ రకమయిన నిర్ణయం తీసుకుంటుంది. అదే ప్రేక్షకుల్లో రాజు వెడ్స్ రాంబాయి పై ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది. అన్నట్టు రాజు వెడ్స్ రాంబాయి టికెట్ రేట్ కూడా చాలా తక్కువే.. జస్ట్ 99 రూపాయలే. మరి ఆడియన్స్ ఈ రకమైన ఆఫర్ చూసి థియేటర్స్ కి కదులుతారో, లేదో చూడాలి.





కేటీఆర్ కు షాకిచ్చిన గవర్నర్ 
Loading..