పాన్ ఇండియా ట్రెండ్ లో స్టార్ హీరోల పారితోషికాలు చుక్కల్ని అంటుతున్నాయి. కోలీవుడ్ లో తళా అజిత్ తన గత చిత్రాలకు 100 కోట్ల పారితోషికాలు అందుకున్నాడు. అతడు నటించిన చివరి చిత్రం `గుడ్ బ్యాడ్ అగ్లీ` కోసం 110 కోట్లు అందుకున్నాడని ప్రచారం సాగింది. అతడు అంతకుమించి డిమాండ్ చేసినా మేకర్స్ 110కోట్లకు అంగీకరించారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆధిక్ ఇప్పుడు అజిత్ కి మరో స్క్రిప్ట్ వినిపించి ఒప్పించాడు. అయితే ఈ సినిమా కోసం అజిత్ ఏకంగా 160 కోట్ల పారితోషికం డిమాండ్ చేసాడని తెలుస్తోంది. నిర్మాతలు 150కోట్ల పారితోషికానికి ఒప్పుకున్నారు. కానీ అజిత్ మొండిగా ఉన్నాడు. అతడు దిగి రాకపోవడంతో ప్రాజెక్ట్ మిడిల్ డ్రాప్ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి అజిత్ నటించిన సినిమాలేవీ ఇటీవల బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజులో ఆడటం లేదు. ఒక్క తమిళనాడు మినహా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అతడి పప్పులుడకడం లేదు. అయినా పారితోషికం విషయంలో అతడు తగ్గడం లేదని తెలుస్తోంది. అన్ని రెమ్యునరేషన్లు కలుపుకుని ప్రాజెక్టు మొత్తానికి 300కోట్లు ఖర్చయితే అంత పెద్ద మొత్తాన్ని తిరిగి రాబట్టడం సవాల్ తో కూడుకున్నది. అందుకే నిర్మాతలు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.





252 కోట్ల డ్రగ్ డీల్.. శ్రద్ధా-నోరా పేర్లు

Loading..