తమిళ స్టార్ హీరో వరసగా ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్న సంగతి తెలిసిందే. తాజా చిత్రం ఇడ్లీ కడైలో ఒక ఇడ్లీ కొట్టు కుర్రాడిగా నటించి ఆశ్చర్యపరిచాడు. స్టార్ స్టాటస్, ఇమేజ్ సమస్యలతో పని లేని హీరో అతడు. స్టార్ అనే పిలుపు కంటే ఒక పాత్రకు ప్రాధాన్యతనిస్తాడు. ఇంతకుముందు శేఖర్ కమ్ముల `కుభేర` చిత్రంలో భిక్షగాడిగా నటించి ఆశ్చర్యపరిచాడు.
ఇప్పుడు స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ఇడ్లీ కడై చిత్రంలో ఇడ్లీ అమ్ముకునే యువకుడిగా నటించాడు. అతడు తన పాత్రలో అద్భుత నటనతో మెస్మరైజ్ చేసాడు. ఒక సాధారణ యువకుడు అంచెలంచెలుగా ఎదిగి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యాక, అదంతా కాదనుకుని, చివరికి తన మూలాలను వెతుక్కుంటూ తిరిగి అదే పాత పూరి గుడిసెలో ఇడ్లీలు అమ్ముకోవడానికి వెనక్కి వచ్చాడంటే ఎంత గట్స్ కావాలి? సామాన్యుడిగా జీవించాలంటే ఆ లైఫ్ ఎంత కష్టంగా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ధనుష్ నటనకు ప్రశంసలు కురిసాయి.
నిజానికి స్పై యాక్షన్ సినిమాలు, రొమాంటిక్ కామెడీలను వీక్షించే రెగ్యులర్ ఆడియెన్ ఇప్పుడు ఇలాంటి ఒక సాధారణ ఇడ్లీ కట్టు కుర్రాడి కథను తెరపై చూస్తారా? అంటే థియేట్రికల్ గా ఇలాంటి సినిమాలను చూడటానికి ఇష్టపడరని `ఇడ్లీ కడై` నిరూపించింది. ఈ సినిమా ఎమోషనల్ కంటెంట్ తో అద్భుతంగా ఉన్నా కానీ జనం థియేటర్లలో చూడటానికి రాలేదు. కానీ దీనిని ఓటీటీలో రిలీజ్ చేసిన తర్వాత గొప్ప ఆదరణ దక్కించుకుంది. నెట్ ఫ్లిక్స్ లో ఇది దేశంలోనే అత్యధిక వీక్షణలు సాధించిన చిత్రంగా నిలిచింది. ఓ వైపు భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ శ్రీలంకలో నంబర్ వన్ స్థానంలో నిలిచిన ఈ చిత్రం గల్ఫ్ దేశాల్లో, నైజీరియా, ఆస్ట్రేలియా, ఖతార్, సింగపూర్, మలేషియాలో టాప్ 10లో నిలిచింది.





నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న స్టార్ హీరో

Loading..