గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం బతికే ఉన్నాడా లేడా? అనేది ఇప్పటికీ సస్పెన్స్. కానీ అతడి మూలాలు ప్రపంచం మొత్తం విస్తరించి ఉన్నాయి. గల్ఫ్ దేశాలతో పాటు పాకిస్తాన్ తో సత్సంబంధాలు కొనసాగించిన దావూద్ బహిరంగంగా కనిపించకపోయినా, అతడి అనుచరులు ప్రపంచవ్యాప్తంగా మాఫియా కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అతడి దగ్గర బంధువు అయిన ప్రముఖ షేక్ తాహిర్ డోలా అతడి తండ్రి సలీం డోలా నిర్వహించిన చాలా రేవ్ పార్టీలలో ప్రముఖ సినీసెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నారని నార్కోటిక్స్ బ్యూరో విచారణలో అంగీకరించినట్టు కథనాలొస్తున్నాయి. తాజాగా రూ.252 కోట్ల విలువైన భారీ డ్రగ్ సిండికేట్ లో భాగం అయిన షేక్ తాహిర్ ని పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా అతడు షాకిచ్చే నిజాల్ని చెప్పారు.
ముంబై పోలీసుల యాంటీ-నార్కోటిక్స్ సెల్ (ఏ.ఎన్.సి) మెఫెడ్రోన్ (ఎం-క్యాట్ లేదా మియావ్ మియావ్) అమ్మకం- పంపిణీ సహా ఇతరత్రా డ్రగ్ సరఫరా నెట్‌వర్క్‌పై నార్కోటిక్స్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే విచారణలో పట్టుబడిన షేక్ శ్రద్ధాకపూర్, నోరా ఫతేహి లాంటి ప్రముఖ సినీ సెలబ్రిటీల పేర్లను ప్రస్థావించాడని, చాలా మంది సినిమా, ఫ్యాషన్ రంగ ప్రముఖులకు ఈ డ్రగ్ (రేవ్) పార్టీలతో సంబంధాలున్నాయని, వారంతా దేశ విదేశాలలోని తన పార్టీలకు అటెండయ్యారని అతడు చెప్పాడు. ఈ వ్యవహారం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వినోద ప్రపంచానికి -వ్యవస్థీకృత నేరాలకు మధ్య ఉన్న రహస్య సంబంధాలను వెలుగులోకి తెచ్చిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
దావూద్ ఇబ్రహీం సహచరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ డ్రగ్ లార్డ్ సలీం డోలా కుమారుడు తాహెర్ డోలాను విచారించగా అసలు విషయాలు బయటపడుతున్నాయి. అధికారుల వివరాల ప్రకారం.. అతడిని దుబాయ్ బహిష్కరించింది. ఆ తర్వాత అతడు భారతదేశం సహా విదశాలలో డ్రగ్ పార్టీలు నిర్వహించాడు. వీటిలో చాలా మంది కథానాయికలు, ఇతర నటీనటులు పాల్గొన్నట్టు అతడు చెప్పాడు. అయితే అధికారుల విచారణలో డ్రగ్ డాన్ పేర్కొన్న సెలబ్రిటీలందరినీ నార్కోటిక్స్ బ్యూరో విచారించేందుకు అవకాశం ఉందని బలమైన టాక్ వినిపిస్తోంది.





తిప్పుకోనివ్వని రాశి ఖన్నా అందం 

Loading..