మాజీ టెన్నిస్ సంచలనం సానియా మిర్జా ఆటలో ఎంతగా రాణించారో, వ్యక్తిగత జీవితంలో అంతగా ఓటమిని ఎదుర్కోవడం ఎవరూ ఊహించనిది. తన భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి 2024లో విడాకులు తీసుకోవడం సానియా జీవితంలో అతి పెద్ద కుదుపు. షోయబ్ సానియాకు విడాకులిచ్చి ప్రముఖ పాకిస్తానీ నటిని పెళ్లాడిన సంగతి తెలిసినదే.
అయితే సానియా ఒంటరితనం గురించి ఓ యూట్యూబ్ ఇంటర్బ్యూలో తన స్నేహితురాలు, ప్రముఖ దర్శకురాలైన ఫరాఖాన్ వ్యాఖ్యలు చర్చగా మారాయి. సానియా మీర్జా తన జీవితంలో అత్యంత ప్యానిక్ అయిన క్షణాలున్నాయని ఫరా అన్నారు. ఇప్పుడు ఒంటరి తల్లిగా ఉన్న సానియా చాలా కష్ట కాలం గడుపుతున్నారని అభిప్రాయపడ్డారు. ఒంటరి తల్లిగా జీవించడం చాలా చాలా కష్టమని ఫరా అభిప్రాయపడ్డారు. ఇంతకుముందు ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో మాట్లాడటానికి వెళ్లిన సానియా చాలా ఒణికిపోయానని కూడా తెలిపారు. అయితే ఫరా ఉండటంతో ఆ కారక్రమం సజావుగా సాగిందని అన్నారు.
విడాకుల తర్వాత పలుమార్లు ప్యానిక్ అయినట్టు సానియా అంగీకరించారు. సానియాకు ఇజాన్ మిర్జా అనే ఒక కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. ఇజాన్ ప్రస్తుతం స్కూల్ కిడ్. పిల్లాడిని సాకుతూ ఉద్యోగం కోసం పరుగెత్తడం తనకు చాలా కష్టంగా ఉందని కూడా సానియా అన్నారు. జీవితంలో ప్రతిదీ అంగీకరించి ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.





విజయ్ కేరాఫ్ రామారావు రివ్యూ

Loading..