పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎప్పుడెప్పుడు సందీప్ వంగ తో కలిసి స్పిరిట్ సెట్ లోకి వెళతారా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. కానీ ప్రభాస్ ఇక్కడిక్కడే అంటే రాజా సాబ్, ఫౌజీ షూటింగ్స్ లోనే గడిపేస్తున్నారు. ఎట్టకేలకు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ షూటింగ్ పూర్తి కావడంతో ప్రభాస్ రిలాక్స్ మోడ్ కి వచ్చేసారు.
హను రాఘవపూడి కూడా ప్రభాస్ తో ఇప్పటికే కీలక సన్నివేశాలు, అలాగే ప్రభాస్ పార్ట్ చాలావరకు చిత్రీకరించడంతో ప్రభాస్ ఈ నెలాఖరుకి అంటే నవంబర్ చివరికి ఫ్రీ అవ్వనున్నారు. అటు సందీప్ వంగ రీసెంట్ గా ఓ మూవీ ఈవెంట్ లో ప్రభాస్ తో స్పిరిట్ మూవీని ఈనెల చివరి నుంచి మొదలు పెట్టనున్నట్లుగా అఫీషియల్ అప్ డేట్ అందించారు.
ఎప్పుడో మూడేళ్ళ క్రితమే స్పిరిట్ అనౌన్సమెంట్ వచ్చినప్పటికి అది ఇప్పటివరకు పట్టాలెక్కలేదు, దానితో ప్రభాస్ ఫ్యాన్స్ స్పిరిట్ మొదలయ్యే క్షణం కోసం వెయిట్ చెయ్యనిరోజు లేదు. ఈ ఏడాది సెప్టెంబర్ లోనే స్పిరిట్ రెగ్యులర్ షూట్ అన్నా ప్రభాస్ ఫ్రీ అవ్వకపోయేసరికి అది ఈ మంత్ ఎండ్ కి షిఫ్ట్ అయ్యింది.





కాంత ప్రీమియర్స్ టాక్ 

Loading..