దుల్కర్ సల్మాన్-రానా, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని కలయికలో సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన కాంత చిత్రం మరికొద్ది గంటల్లో ప్రేక్షకులముందుకు రాబోతుంది. ఇప్పటికే తమిళ షోస్, తెలుగు ప్రీమియర్స్ పూర్తి కావడంతో చాలామంది ఆడియన్స్ కాంత ని ఎక్స్పీరియన్స్ చేసి సోషల్ మీడియాలో తమ స్పందనను తెలియజేస్తున్నారు.
తమిళం నుంచి కాంత కి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అంతేకాదు తమిళ ప్రముఖ వెబ్ సైట్స్ కాంత కు అద్భుతమైన రివ్యూస్ ఇవ్వడం, తెలుగు ప్రీమియర్స్ నుంచి కూడా కాంత కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కాంత తెలుగు ప్రీమియర్స్ టాక్ లోకి వెళితే..
దుల్కర్ సల్మాన్ పర్ఫార్మెన్స్ తో మరోసారి అద్భుతం చేసాడు. కాంత ఫస్ట్ హాఫ్ లో ప్రతి సీన్ చాలా బాగుంది, ఎక్స్‌లెంట్, దుల్కర్-భాగ్యశ్రీ బోర్సే రొమాన్స్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ హైలైట్ అంటూ కొంతమంది ఆడియన్స్ కాంత పై కామెంట్లు పెడుతున్నారు.
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే మధ్య రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది, ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది, భాగ్యశ్రీ బోర్సే తన పాత్రను అద్భుతంగా పోషించింది, ఇది భాగ్యశ్రీ బోర్సే కెరీర్ లో గుర్తుండిపోయే కేరెక్టర్, జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వేరే లెవల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సెకండ్ హాఫ్ సింప్లి సూపర్బ్. దుల్కర్ నటన, సముద్రఖని యాక్టింగ్, భాగ్యశ్రీ బోర్సే అందాలు, ఆమె పెరఫార్మెన్స్, సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్, BGM, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్ని కాంత కి హైలెట్, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కాంతా లో అత్యంత అద్భుతం, ఓవరాల్ గా సినిమా ఎక్స్ట్రార్డినరీ అంటూ తెలుగులో స్పెషల్ ప్రీమియర్స్ చూసిన వారు కాంత చిత్రానికి ఇస్తున్న ఫీడ్ బ్యాక్.





రజిని-కమల్ కి హోల్‌సేల్ షాక్ 

Loading..