దుల్కర్ సల్మాన్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా సముద్రఖని, రానా కీలక పాత్రల్లో తమిళ డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన కాంత చిత్రం రేపు శుక్రవారం తెలుగులో విడుదల కాబోతుంది. ఇప్పటికే తమిళనాట విడుదలైన కాంత చిత్రానికి అన్ని వైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది.
తమిళనాట కాంత చిత్రాన్ని వీక్షించిన క్రిటిక్స్ ఆ చిత్రానికి అద్దిరిపోయే రివ్యూస్, రేటింగ్స్ ఇచ్చారు. ప్రముఖ క్రిటిక్ రమేష్ బాల ఏకంగా నాలుగున్నర రేటింగ్ ఇవ్వడంతో కాంత పై తెలుగులోనూ హైప్ పెరిగిపోతుంది. కోలీవుడ్ లో ప్రముఖ వెబ్ సైట్స్ కాంత చిత్రానికి పాజిటివ్ రివ్యూస్, రేటింగ్స్ ఇవ్వడం చూసినవారు తెలుగులోనూ కాంత బ్లాక్ బస్టర్ ఖాయమంటున్నారు.
మరికొద్దిసేపట్లో తెలుగులోనూ ప్రెస్ ప్రీమియర్స్ ప్లాన్ చేసారు మేకర్స్. మరి కాంత చిత్రానికి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యి తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయితే కాంత సరికొత్త రికార్దులను సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కాంత ట్రైలర్ తోనే దుల్కర్ నటనకు, భాగ్యశ్రీ బోర్సే అందాలకు, సముద్రఖని పెరఫార్మెన్స్ పై పాజిటివ్ వైబ్స్ రావడంతో అందరిలో ఆసక్తి పెరిగిపోయింది.





పెళ్లిపై నటి వ్యాఖ్యల్ని ఖండించిన నెటిజన్లు 

Loading..