మాజీ మినిస్టర్ కేటీఆర్ ని టార్గెట్ చేసే క్రమంలో అక్కినేని ఫ్యామిలీని నాగార్జున ని కించపరిచే మాటలతో బాధపెట్టగా కొండా సురేఖ పై నాగార్జున పరువు నష్టం కేసుపెట్టిన విషయం తెలిసిందే. ఆ కేసు నాంపల్లి కోర్టులో విచారణలో ఉంది. అయితే నాగార్జున పై చేసిన వ్యాఖ్యల విషయంలో కొన్ని నెలల తర్వాత సురేఖ రియలైజ్ అయ్యి నాగార్జున పై చేసిన కామెంట్స్ విషయంలో చింతిస్తున్నాను, ఆలా అనకుండా ఉండాల్సింది అంటూ సారీ చెప్పింది.
కొండా సురేఖ విషయంలో ఆగ్రహంతో ఉన్న నాగార్జున కేసు విషయంగా పలుమార్పు నాంపల్లి కోర్టుకి హాజరయ్యారు. అయితే సురేఖ సారీని నాగార్జున యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది. ఫైనల్ గా నాగార్జున కొండా సురేఖ సారీ ని యాక్సెప్ట్ చేసారు. ఎలా అంటే ఆయన కొండా సురేఖ పై పెట్టిన కేసుని వాపస్ తీసుకున్నారు.
సో కొండా సురేఖ vs నాగార్జున ఇష్యు ఇంతటి తో క్లోజ్ అయినట్లే కనిపిస్తుంది. ఇప్పటికే రెండు సార్లు సోషల్ మీడియా వేదికగా అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పిన కొండ సురేఖ కి ఇప్పుడు నాగార్జున కేసు వాపస్ తీసుకోవడంతో బిగ్ రిలీఫ్ ఇచ్చినట్టయ్యింది.





కాంత: తమిళ్ నుంచి అద్దిరిపోయే రివ్యూస్ 

Loading..