సీనియర్ నటి కాజోల్, నటి కం రచయిత్రి ట్వింకిల్ ఖన్నా జోడీ ఇటీవల బుల్లితెర షోలో సందడి చేస్తున్న తెలిసిందే. `టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్` షోలో సెలబ్రిటీల రహస్యాలను బయటపెట్టేందుకు ఆ ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. ఈ షోలో ఇప్పటికే చాలా మంది సీనియర్ నటీనటులతో పాటు నవతరం స్టార్లు పాల్గొన్నారు. తమ వ్యక్తిగత జీవితంలో చాలా అంశాల గురించి వారు చర్చించారు.
ఇప్పుడు విక్కీ కౌశల్, కృతి సనోన్ ఈ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెళ్లి గురించి, దాని వ్యవధి గురించి ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి కాజోల్ స్పందిస్తూ, పెళ్లికి ఒక ఎక్స్ పైరీ డేట్ ఉండాలని, దానివల్ల జంటలు వ్యవధికి మించి బాధపడాల్సిన అవసరం ఉండదని షాకింగ్ కామెంట్ చేసారు. పెళ్లాడేప్పుడు భాగస్వామి ఎలాంటి వారో ముందే తెలియదు కదా! అని అభిప్రాయపడ్డారు.
అయితే దీనికి భిన్నమైన వాదనను వినిపించారు ట్వింకిల్. ``ఇది వివాహం.. వాషింగ్ మెషీన్ కాదు..!`` అని వ్యాఖ్యానించారు. చాలా మంది కాజోల్ బోల్డ్ కామెంట్ ని విమర్శించారు. అదే సమయంలో ట్వింకిల్ వ్యాఖ్యలకు ప్రశంసలు దక్కాయి. అయితే కొందరు కాజోల్ వ్యాఖ్యలను సమర్థిస్తూ కూడా కామెంట్లు పెట్టారు. మెజారిటీ భాగం నెటిజనులు కాజోల్ వ్యాఖ్యలను విమర్శించారు.





ఇది ఎవరి బ్యాడ్ లక్ జక్కన్నా 

Loading..