బాలీవుడ్ నటుడు గోవిందా గత రాత్రి తన ఇంట్లోనే సృహ లేకుండా పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన ముంబైలోని జుహు లోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. గోవిందా స్పృహ కాలేకుండా పడిపోయాడనే వార్తలు వైరల్ అవడంతో ఆయన అభిమానులు చాలా టెన్షన్ పడ్డారు.
ఈరోజు ఉదయమే గోవిందా స్పృహలోకి రావడం, సంబంధిత టెస్ట్ లు పూర్తి అయ్యాక గోవిందా ఆరోగ్యంగా ఉండంతో డాక్టర్స్ ఆయన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. అయితే గోవిందా అలా ఎందుకు స్పృహ తప్పారో అనే విషయంలో రకరకాల వార్తలు వినిపించగా గోవిందా తానెందుకు స్పృహ తప్పి పడిపోయానే అనే విషయాన్ని రివీల్ చేశారు.
తాను అధికంగా వ్యయం చేయడం వలనే స్పృహ తప్పినట్లుగా చెప్పారు. ఎక్కువగా వ్యాయామం చేశాను, దానితో తల బరువెక్కింది. స్పృహ కోల్పోతానేమో అనే అనుమానం వచ్చింది, కాసేపు అలానే ఉన్నా తగ్గలేదు, దానితో ఆసుపత్రికి వెళ్లడం మంచిది అని వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాను, ప్రస్తుతం తను హెల్దీ గానే ఉన్నాను అంటూ గోవిందా ఈ ఘటనపై స్పందించారు.





SSMB 29-ప్రియాంక చోప్రా లుక్ వచ్చేసింది 

Loading..