SSMB 29-ప్రియాంక చోప్రా లుక్ వచ్చేసింది

Wed 12th Nov 2025 08:26 PM
priyanka chopra  SSMB 29-ప్రియాంక చోప్రా లుక్ వచ్చేసింది
SSMB 29 - Priyanka Chopra Blazes All Guns SSMB 29-ప్రియాంక చోప్రా లుక్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

ఈ నెల 15 శనివారం జరగబోయే #GlobeTrotter ఈవెంట్ కన్నా ముందే దర్శకుడు రాజమౌళి SSMB29 నుంచి వరసబెట్టి సర్ ప్రైజ్ లు వదులుతూనే ఉన్నారు. ముందే పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ కుంభ లుక్ ని రివీల్ చెయ్యడం, తర్వాత శృతి హాసన్ సంచారి సాంగ్ రివీల్ చెయ్యడం ఇవన్నీఅందరికి సర్ ప్రైజింగ్ గానే ఉన్నాయి. 

రెండు రోజుల్లో జరగబోయే #GlobeTrotter ఈవెంట్ కన్నా ముందే ప్రియాంక చోప్రా లుక్ ని వదిలారు. చీరకట్టులో గన్ తో ప్రియాంక చోప్రా మందాకినీ లుక్ లో కనిపించింది. ఎల్లో శారీ లో ప్రియాంక చోప్రా SSMB 29 లుక్ కొట్టగానే ఉంది. కానీ చాలామంది అందులో స్పెషల్ ఏముంది.. ప్రియాంక హాలీవుడ్ మూవీస్ లో ఇలానే కనిపిస్తుంది, కాకపోతే ఇక్కడ చీరకట్టులో కనిపించింది అంటూ మాట్లాడుతున్నారు. 

మరి రాజమౌళి #GlobeTrotter ఈవెంట్ లో ఎలాంటి గ్లింప్స్ ప్లాన్ చేసారో తెలియదు కానీ.. ఈ ఈవెంట్ కన్నా ముందే సడన్ సర్ ప్రైజ్ లు ఇచ్చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నారు. ఇక ఆ ఈవెంట్ లో ఏం చూపిస్తారో అనే ఉత్సుకత మాత్రం అందరిలో అంతకంతకు పెరిగిపోతుంది. 

SSMB 29 - Priyanka Chopra Blazes All Guns :

Priyanka Chopra first look from SSMB 29 released

Tags:   PRIYANKA CHOPRA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ