నేషనల్ క్రష్ రష్మిక మందన్న నామ సంవత్సరంగా ఈ 2025 సంవత్సరం మిగిలిపోతుంది. రష్మిక నటించిన సినిమాలు ఈ ఏడాది ఏకంగా ఐదు రిలీజ్ అయ్యాయి. 2025 ఏడాది మొదలుకుని నిన్న గర్ల్ ఫ్రెండ్ వరకు రష్మిక నే కనిపించింది. బాలీవుడ్ లో మూడు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అయ్యాయి. హిందీలో ఛావా, సికందర్, థామా.. సౌత్ లో కుబేర, గర్ల్ ఫ్రెండ్ వచ్చాయి.
గర్ల్ ఫ్రెండ్ రీసెంట్ గా అంటే గత శుక్రవారమే విడుదలై పాజిటీవ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినీ విమర్శకులతో పాటుగా ఆడియన్స్ కూడా గర్ల్ ఫ్రెండ్ ని మెచ్చడంతో ఐదు రోజులు తిరిగేలోపే గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్స్ పరంగా ప్రభంజనం సృష్టించింది. గర్ల్ ఫ్రెండ్ విమెన్ సెంట్రిక్ మూవీ అవడంతో ఓపెనింగ్స్ కనిపించలేదు.
కానీ మౌత్ టాక్ తో రెండోరోజు నుంచి సినిమాకి మంచి నెంబర్లు నమోదు అయ్యి.. ఐదు రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ 20 కోట్ల షేర్ రాబట్టినట్టుగా మేకర్స్ పోస్టర్ వేసి ప్రకటించారు. మరి రష్మిక కమర్షియల్ గానే కాదు సోలో గాను కొట్టగలదు అని గర్ల్ ఫ్రెండ్ ప్రూవ్ చేసింది. ఈ చిత్రంలో రష్మిక-దీక్షిత్ శెట్టి పెరఫార్మెన్స్ కి యూత్ ఫిదా అవుతుంది.
అన్నట్టు ఈరోజు బుధవారం రష్మిక బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ గెస్ట్ గా గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ చెయ్యనున్నారు మేకర్స్.





దేశంలో అత్యంత పేద ఫిలింమేకర్ బయోపిక్
Loading..