సమంత న్యూ బిగినింగ్, న్యూ చాప్టర్ బిగినింగ్ అంటూ సోషల్ మీడియాలో ఎప్పుడైతే పోస్ట్ పెడుతుందో అపుడు ఆమె తన లైఫ్ లో న్యూ చాప్టర్ గురించి చెబుతుందేమో అనే ఆశ మొదలవుతుంది అభిమానులకి. కారణం ఆమె దర్శకుడు రాజ్ నిడిమోరు తో క్లోజ్ గా ఉండడంతో సమంత.. రాజ్ నిడిమోరు ని రెండో వివాహం చేసుకుంటుంది అనే ప్రచారం జరుగుతుంది..
అందుకే ఆమె సోషల్ మీడియా పోస్ట్ లపై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈమధ్యన న్యూ బిగినింగ్ అంటూ కొత్త ఇంటి ఫోటోలను పోస్ట్ చేసిన సమంత తాజాగా న్యూ చాప్టర్ బిగినింగ్ అంటూ ఇన్స్టా లో మరో స్టోరీ పెట్టింది. సమంత తన కొత్త క్లాతింగ్ బ్రాండ్ ట్రూలీ.స్మా ని స్టార్ట్ చేసినట్లుగా ఇన్స్టా స్టోరీ లో పోస్ట్ పెట్టింది.
న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దానితో సమంత కొత్త బిజినెస్ మొదలుపెట్టింది కానీ.. లైఫ్ లోనే ఇంకా మూవ్ ఆన్ అవ్వలేకపోతుంది. రాజ్ తో స్నేహమో, ప్రేమో అనేది రివీల్ చేస్తే ఈ కన్ఫ్యూజన్ ఉండదుగా అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.





ఐదు రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ ప్రభంజనం 

Loading..