దేశంలో అత్యంత పేద ఫిలింమేక‌ర్ బ‌యోపిక్

Wed 12th Nov 2025 04:37 PM
siddhant chaturvedi  దేశంలో అత్యంత పేద ఫిలింమేక‌ర్ బ‌యోపిక్
Legendary filmmaker biopic దేశంలో అత్యంత పేద ఫిలింమేక‌ర్ బ‌యోపిక్
Advertisement
Ads by CJ

ఎలాంటి సినీనేప‌థ్యం లేకుండా బాలీవుడ్ లో ఎదుగుతున్న హీరోల‌లో సిద్ధాంత్ చ‌తుర్వేది ఒక‌రు. గల్లీ బాయ్ (2019) సినిమాతో తెరంగేట్రం చేసిన అత‌డు గెహ్ర‌యాన్‌లో దీపిక‌తో రొమాన్స్ అద‌ర‌గొట్టేసాడు. ఇటీవలే ధడక్ 2 (2025) తో న‌టుడిగా మ‌రోసారి త‌న స‌త్తా చాటాడు. సిద్ధాంత్ ఒక్కో సినిమాతో ప‌రిణ‌తి చెందిన న‌టుడిగా నిరూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.

అత‌డు ఇప్పుడు మ‌రో ఛాలెంజింగ్ స్క్రిప్ట్ ను ఎంపిక చేసుకున్నాడు. లెజెండరీ దర్శకుడు, నటుడు, నిర్మాత కం రచయిత వి శాంతారామ్ జీవిత‌క‌థ‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి `చిత్రపతి వి శాంతారామ్` అని పేరు పెట్టారు. టైటిల్ పాత్ర‌లో అతడు మ‌రోసారి నిరూపించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడ‌ని తెలిసింది. దీనికోసం అత‌డు చాలా శ్ర‌మిస్తున్నాడు. ఈ చిత్రం సిద్ధాంత్ నటించిన సినిమాలలోనే అతిపెద్ద చిత్రం కానుంది. ఇది అత‌డి అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రికార్డుల‌కెక్క‌నుంది.

సిద్దాంత్ త‌న గ‌త చిత్రాల‌తో అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన‌ న‌టుడిగా నిరూపించాడు. అందుకే ఇప్పుడు నిర్మాత‌లు ఈ అవకాశాన్ని అత‌డికి క‌ట్ట‌బెట్ట‌డానికి దోహ‌ద‌ప‌డింద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ జ‌రుగుతోంది. సిద్ధాంత్ సీనియ‌ర్ ఫిలింమేక‌ర్ శాంతారామ్ పాత్రలోకి   మార‌డానికి త‌న‌వంతు ప‌ని మొద‌లు పెట్టాడు. అత‌డు త‌న రూపాన్ని మార్చుకోవ‌డంతో పాటు, ఆహార్యం ప‌రంగాను షార్ప్ గా క‌నిపించ‌డానికి చాలా క‌స‌ర‌త్తు చేస్తున్నాడు.

భారతీయ చ‌ల‌న‌చిత్ర పరిశ్రమ లెజెండ‌రీ ఫిలింమేక‌ర్ శాంతారామ్ భార‌తీయ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ ఎదుగుద‌ల‌కు అందించిన సహకారం అపారమైనది. ఈ చిత్రంతో ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ చాలా విష‌యాల‌ను నేర్చుకునేందుకు ఆస్కారం ఉంది.

కొల్హాపూర్‌లో కడు పేదరికంలో జన్మించిన శాంతారామ్ పూణేలోని బాబూరావు పెయింటర్ వద్ద ఫిలింమేకింగ్ నేర్చుకున్నారు. ఆ త‌ర్వాత జ‌న‌కార్ జ‌న‌కార్ పాల్ బాజ‌జ్ (1955), దో ఆంఖేన్ బరా హాత్ (1957) వంటి చిత్రాలతో హిందీ చిత్ర పరిశ్రమలో మరపురాని ముద్ర వేసాడు. అప్ప‌ట్లో ఆయ‌న ట్రెండ్ సెట్ట‌ర్ గా నిరూపించారు.

మ‌హిళా న‌టీమ‌ణుల‌ను ఎంపిక చేసిన మొదటి ఫిలింమేక‌ర్ గా ఆయ‌న చ‌రిత్ర సృష్టించారు. చలనచిత్ర సంగీత హక్కులను విక్రయించిన మొదటి వ్యక్తిగా , క‌ల‌ర్ మూవీని ప్రయత్నించిన మొదటి ద‌ర్శ‌క‌నిర్మాతగాను శాంతారామ్ ప్ర‌భావ‌వంత‌మైన వ్య‌క్తిగా రికార్డుల‌కెక్కారు.

శాంతారామ్ తెర‌కెక్కించిన చిత్రాలు కేన్స్, వెనిస్, బెర్లిన్ చలనచిత్రోత్సవాలలో ప్రశంసలు అందుకున్నాయి. 1959లో గోల్డెన్ గ్లోబ్ స‌త్కారం కూడా అందుకున్నారు. చార్లీ చాప్లిన్ వి శాంతారామ్ పనిని ప్రశంసించాడని కూడా క‌థ‌నాలొచ్చాయి. బొంబాయి (ప్ర‌స్తుత‌ ముంబై) లోని అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో అత‌డికి వైరం ఉంద‌న్న విష‌యం కూడా బ‌యోపిక్ లో చూపించే వీలుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఈ బ‌యోపిక్ లో చాలా డ్రామా, ఎమోష‌న్స్ కి ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది.

Legendary filmmaker biopic:

Siddhant Chaturvedi to play V Shantaram in biopic

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ