తిరుమల తిరుపతి శ్రీవారి కల్తీ నేయి వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటుంది. దేవుడి ప్రసాదం విషయంలో తప్పు చేసిన వారిని వదలమంటూ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుని కూర్చుంది. తాజాగా శ్రీవారి కల్తీ లడ్డు వ్యవహారంలో అసలు నిజాలు కాదు కాదు అసలు దొంగలు బయటికి వస్తున్నారు.
కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రధారి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంటూ తాజాగా మాజీ ఈవో ధర్మారెడ్డి సీబీఐ సిట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. లడ్డు ప్రసాదం కోసం కల్తీ నెయ్యిని సరఫరా చేసిన బోలెబాబా సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చేందుకు తమపై అన్ని విధాల సుబ్బారెడ్డి ఒత్తిడి చేయించాడని, టీటీడీ చైర్మన్ హోదాలో సుబ్బారెడ్డి ఒత్తిడి చేయడంతో అర్హత లేని బోలె బాబా సంస్థతో అయిష్టంగానే నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామని.. బోలెబాబా సంస్థ సరఫరా చేసింది కల్తీ నెయ్యి అని తమకు అప్పుడు తెలిసినప్పటికీ ఏమీ చేయలేకపోయామని సిట్ ఎదుట ధర్మారెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తుంది.
మరి ఈ టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు దగ్గరి బంధువు కావడం అది కూడా వైసీపీ పాలనలో ఉన్న సమయంలో నెయ్యి కల్తీ కావడంతో.. తాజా పరిణామాలు రాజకీయంగా ఏపీ రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, మరోపక్క ఈ దర్యాప్తుని సిట్ లేదా పోలీసులు లో కాకుండా సీబీఐ విచారణ జరుపుతుండడంతో.. ప్రస్తుత పరిస్థితుల్లో దర్యాప్తు సంస్థపై నిందలు మోపలేని దుస్థితిలో వైఎస్సార్సీపీ పడిపోయింది.





బిగ్ బాస్ 9 - టాప్ లో భరణి
Loading..