బిగ్ బాస్ సీజన్ 9 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి మూడు వారాలు ఆటలో అంతే స్ట్రాంగ్ గా కనిపించిన భరణి దివ్య ఎంట్రీ తో దివ్య ట్రాప్ లో పడి ఆట ఆడినా బంధాల వలన క్రేజ్ కోల్పోయాడు. తనూజ తో నాన్న అని పిలిపించుకున్నా అతనికి ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు కానీ దివ్య వలన భరణి గ్రాఫ్ పడిపోయింది. మధ్యలో ఎలిమినేట్ అయ్యి అదృష్టం ఉండి లోపలికొచ్చాడు.
ఆతర్వాత కూడా భరణి పై ఆడియన్స్ లో నమ్మకం రాలేదు. దివ్య వలన భరణి కి డ్యామేజ్ అవుతుంది కాదు అయ్యింది. అది తెలుసుకుని భరణి ఈ వారం దివ్య ను నామినేట్ చెయ్యడంతో భరణి పై ఆడియన్స్ లో నమ్మకం పెరిగింది. ఈ వారం హౌస్ మొత్తాన్ని బిగ్ బాస్ నామినేట్ చేసాడు. ఆఖరికి కెప్టెన్ ని కూడా కానీ ఇమ్ము ని భరణి తప్ప హౌస్ మేట్స్ అందరూ సేవ్ చేసారు.
ఏదైనా స్టాండ్ తీసుకోవడంలో మునుపటి భరణిని చూసిన ఆడియన్స్ ఈ వారం ఓటింగ్ లో టాప్ లో నిలబెట్టారు. అదే సమయంలో దివ్య లీస్ట్ లో ఓటింగ్ తో డేంజర్ జోన్ లోకి రావడం షాకిచ్చింది. కొంతమంది అనధికారికంగా పోల్స్ పెట్టగా పదో వారంలో వోటింగ్ లో భరణి టాప్ లో ఉండడం అంటే నామినేషన్స్ క్వీన్ తనూజ కన్నా ఎక్కువ ఓట్లు కొల్లగొడుతున్నారు.
లీస్ట్ లో దివ్య, గౌరవ్ ఉన్నారు. మరి ఈవారం దివ్య టాస్క్ లో సేవ్ అయితే గౌరవ్ ఎలిమినేట్ అవ్వొచ్చు, లేదంటే ఖచ్చితంగా దివ్య నే బయటికి వెళ్ళిపోతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు.





ఆసుపత్రిలో చేరిన మరో బాలీవుడ్ నటుడు 

Loading..