గత రెండు రోజులుగా బాలీవుడ్ సీనియర్ నటులు ధర్మేంద్ర ఆసుపత్రి లో చికిత్స పొందుతుంటే ఆయన చనిపోయారంటూ వార్తలు రావడం, వాటిని ఫ్యామిలీ మెంబెర్స్ ఖండించడం, బాలీవుడ్ స్టార్స్ ధర్మేంద్ర ను చూసేందుకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి కి వెళ్లడం ఇలా మీడియాలో చాలా గందరగోళమే నడిచింది. ప్రస్తుతం ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటిలో చికిత్స పొందుతున్నారు.
బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి కి ధర్మేంద్ర ను చూసేందుకు వెళ్లొచ్చిన మరో బాలీవుడ్ నటుడు గోవిందా గత రాత్రి తన ఇంట్లోనే స్పృహ లేకుండా పడిపోవడంతో అందరూ ఆందోళన పడ్డారు.. అప్పటివరకు చాలా యాక్టీవ్ గా ఉన్న గోవిందా మంగళవారం అర్ధరాత్రి సమయంలో స్పృహ తప్పడంతో ఫ్యామిలీ మెంబెర్స్ ఆయన్ను హాస్పిటల్ కి తరలించకముందే ఫోన్ లో డాక్టర్ తో మాట్లాడి వైద్యుల సూచనలు మేరకు ప్రధమ చికిత్స అందించినట్లుగా తెలుస్తుంది.
ఆతర్వాత ఆసుపత్రిలో చేరిన గోవిందా ప్రస్తుతం స్పృహలోకి వచ్చారని, ఆయనకు అవసరమైన టెస్ట్ లు చేస్తున్నారని గోవిందా మేనేజర్ శశి సిన్హా మీడియాకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం గోవిందా ముంబై జుహులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.





దుల్కర్ కాంత పై కోర్టు కేసు 
Loading..