బ్రతికున్న మనుషులను చంపెయ్యడం, ఆ వార్తలను హెడ్ లైన్స్ గా మార్చుకుని తాటికాయంత అక్షరాలు వేయడం ఓ వర్గం మీడియా కి సాధారణమైపోయింది. నిన్న మంగళవారం బాలీవుడ్ సీనియర్ నటులు ధర్మేంద్ర అనారోగ్య కారణాలతో మృతి చెందారంటూ నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలు తెగ వైరల్ అయ్యాయి. కానీ అదే వార్తలు ధర్మేంద్ర కుటుంబాన్ని బాధపెట్టాయి. ఎందుకంటే ధర్మేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కానీ ఆయన చనిపోలేదు.
మీడియాలో ధర్మేంద్ర మృతి చెందారని వార్తలు చూసి ఆయన రెండో భార్య హేమ మాలిని, కుమార్తె ఈషా డియోల్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలాంటి వార్తలు ఎలా వేస్తారు. బ్రతికున్న మనిషి చనిపోయారంటూ రాయడమేమిటి, ధర్మేంద్ర ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటూ ఆయన మృతి చెందారంటూ వస్తున్న ఫేక్ వార్తలను ఖండించారు.
ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరిన వెంటనే బాలీవుడ్ స్టార్స్ ముంబై బ్రీచ్ కాండీ ఆసుపత్రి కి క్యూ కట్టారు. దానితో ధర్మేంద్ర మృతి చెందారనే వార్తలను చాలామంది నమ్మారు. కానీ ఫ్యామిలీ మెంబెర్స్ ఖండించారు. మరోపక్క ఆయన చనిపోయినా ఆస్తి తగాదాలతో ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు బయట పెట్టడం లేదు అంటూ పుకార్లు షికార్లు చేసాయి..
అయిపోతే ధర్మేంద్ర ఈరోజు వూధవారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా గత నెల 31న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆయన ఈరోజు బుధవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. ఆయనకు ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలపడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నాను.





మిడ్ నైట్ కొండా సురేఖ కు జ్ఞానోదయం 
Loading..