మిడ్ నైట్ కొండా సురేఖ కు జ్ఞానోదయం

Wed 12th Nov 2025 09:53 AM
konda surekha  మిడ్ నైట్ కొండా సురేఖ కు జ్ఞానోదయం
Minister apologises to King Nagarjuna మిడ్ నైట్ కొండా సురేఖ కు జ్ఞానోదయం
Advertisement
Ads by CJ

మంత్రి కొండా సురేఖ గతంలో కేటీఆర్ ని టార్గెట్ చేసే క్రమంలో అక్కినేని నాగార్జున ఫ్యామిలీని కించపరిచే మాటలనడంతో అప్పట్లో ఆమెపై పెద్ద దుమారమే చెలరేగింది. ఆఖరికి కాంగ్రెస్ నేతలు కూడా ఫైర్ అయ్యారు. నాగార్జున అయితే ఏకంగా కొండా సురేఖ పై పరువు నష్టం కేసు పెట్టినప్పటికీ కొండా సురేఖ వెనక్కి తగ్గలేదు. నాగార్జున ఫ్యామిలీపై అన్న వ్యాఖ్యలకు ఆమె కట్టుబడే ఉంది.

అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం సురేఖ పై ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు ఆమె మంత్రి పదవి కూడా ఊడుతుంది అనే ప్రచారం జరిగింది. 

ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఈ కేసు నడుస్తుండగా.. కొండా సురేఖ కు అర్ధరాత్రి జ్ఞానోదయం అయినట్లుగా రాత్రి నాగార్జున పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా, తాను ఆ సమయంలో అలా అనకుండా ఉండాల్సింది అంటూ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 

I would wish to clarify that the statement I had made in relation to @iamnagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family members. 

I had no intention of hurting or defaming Akkineni Nagarjuna Garu or his family members. 

I regret any unintended impression given in my statements in relation to them and withdraw the same.

నేను నాగార్జున గారిని కానీ ఆయన ఫ్యామిలీని కానీ కించపరచాలనే ఉద్దేశ్యంతో అలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు, వాళ్ళ పరువు తియ్యాలనుకోవడం కానీ, వాళ్ళను బాధపెట్టే ఉద్దేశ్యం నాకు లేదు, అదే మరోసారి స్పష్టం చేస్తున్నాను, అనుకోకుండా ఇచ్చిన స్టేట్మెంట్ కి చింతిస్తున్నాను, నేను నాగార్జున ఫ్యామిలీ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ సురేఖ ట్వీట్ చేసింది. మరి ఈ ట్వీట్ కి నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి. 

Minister apologises to King Nagarjuna:

Konda Surekha finally apologises to Nagarjuna

Tags:   KONDA SUREKHA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ