మహేష్ బాబు-రాజమౌళి కాంబో అప్ డేట్స్ సోషల్ మీడియాని సునామీలా ముంచెత్తుతున్నాయి. నవంబర్ 15 శనివారం సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే #GlobeTrotter ఈవెంట్ కన్నా ముందు విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ ఇవ్వడం, ప్రియాంక వీడియో బైట్ దానితో పాటుగా శృతి హాసన్ పాడిన సంచారి సాంగ్ విడుదల చెయ్యడం ఇలా రాజమౌళి ప్లానింగ్ ఉంది.
అయితే ఎందుకో నిన్నటివరకు ఉన్న హైప్ ఇప్పుడు ఈ #GlobeTrotter విషయంలో లేదు అనే మాటలు, పృథ్వీ రాజ్ లుక్ తేలిపోయింది, అది కాపీ లుక్ అంటూ ట్రోల్స్ కనిపిస్తున్నాయి. మరోపక్క వారణాసి కాదు, రుద్ర కాదు మహేష్ మూవీకి సంచారి అనే టైటిల్ పెడుతున్నారు కాబట్టే ఆ సాంగ్ వదిలారు అని, కానీ ఈ టైటిల్ ఇంటర్నేషనల్ లెవల్లో లేవు అని మాట్లాడుకుంటున్నారు.
అసలు రాజమౌళి ఈ SSMB 29 కి ఓ టైటిల్ ని ఎప్పుడో అనుకుని లాక్ చేసి దాచేసారు.. ఈ వారణాసి, రుద్ర, సంచారి టైటిల్స్ ని జస్ట్ శాంపిల్స్ గా వదిలారు.. అసలు టైటిల్ వేరేగా ఉంది.. అది కూడా హాలీవుడ్ రేంజ్ లోనే ఉంటుంది అంటూ రాజమౌళిని తక్కువ అంచనా వేశారు అంటే దెబ్బడిపోతుంది అనే కామెంట్లు వినబడుతున్నాయి.
చూద్దాం రాజమౌళి #GlobeTrotter ఈవెంట్ లో ఎన్ని సర్ ప్రైజ్ లు ఇస్తారో, ఎలాంటి ట్రీట్ ఆడియన్స్ కు ఇవ్వబోతున్నారో అనేది.. జస్ట్ వెయిట్ అండ్ సి.





ధర్మేంద్ర హెల్త్ పై షాకింగ్ అప్ డేట్ 
Loading..