నేడు దేశ రాజధాని ఢిల్లీ లో ఘోర పేలుళ్ళు కలకలం సృష్టించింది. పేలుళ్లతో దద్దరిల్లిన రాజధాని ఢిల్లీ. ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద భారీ పేలుడు సంభవించగా.. ఆ పేలుడు దాటికి ప్రస్తుతానికి 8 మంది మృతి చెందగా, పలువురికి గాయాలు అయినట్లుగా తెలుస్తుంది. ఆ పేలుడు ధాటికి ఛిద్రమైన మృతదేహలు.. పేలుడు సంబవించిన ప్రాంతమంతా భయానక దృశ్యాలు తాండవిస్తున్నాయి.
మెట్రోస్టేషన్‌లో పార్కింగ్ చేసిన ఓ కారులో ఎర్రకోట గేట్ నెంబర్-1 దగ్గర పేలుడు సంభవించగా.. పేలుడు ధాటికి పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి.. ఆ ధాటికి పూర్తిగా ధ్వంసమైన ఐదు ఇళ్లు, పలు షాపులు, 7 ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.
ఘటనాస్థలికి క్లూస్ టీమ్, ఇతర దర్యాప్తు బృందాలు చేరుకున్నాయి. ఈరోజు సాయంత్రం 6.45 సమయంలో కారులో పేలుడు సంభవించింది. సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నఋ ఫోరెన్సిక్, స్పెషల్ సెల్ పోలీసులు. పేలుడు సంభవించిన స్థల సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు, ఈ పేలుడుతో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..





BB9: ఇంట్రెస్టింగ్- దివ్య పై భరణి ఫైర్ 

Loading..