నవంబర్ 15న జరగబోయే #GlobeTrotter ఈవెంట్ కన్నా ముందే రాజమౌళి SSMB 29 పై విపరీతమైన అంచనాలు పెంచేలా అప్ డేట్స్ వదులుతున్నారు. ఇప్పటికే విలన్ కుంభ పాత్రధారి పృథ్వీ రాజ్ సుకుమారన్ లుక్ రివీల్ చేసిన రాజమౌళి.. ఈరోజు కోలీవుడ్ నటి, సింగర్ శృతి హాసన్ తో పాడించిన సాంగ్ ని రివీల్ చేశారు.
అసలు ఎలాంటి అప్ డేట్ లేకుండానే సడన్ సర్ ప్రైజ్ అంటూ.. మేకర్స్ ఓ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ పేరు GlobeTrotter. ఈ పాటను శ్రుతి హాసన్ స్వయంగా పాడింది. ఆమె వాయిస్, లిరిక్స్, మ్యూజిక్ కలిపి ఈ సాంగ్ కి కొత్త ఫీల్ ని తెచ్చాయి. సంచారి.. సంచారి.. అంటూ సాగే లైన్స్, హీరో పాత్ర జర్నీని హైలెట్ చేస్తుంది.
అయితే ఈ సాంగ్ GlobeTrotter ఈవెంట్ కోసం ప్లాన్ చేసారా లేదంటే మరేదన్నా సర్ ప్రైజ్ అనేది తెలియదు కానీ.. ఎలాంటి అనౌన్సమెంట్ లేకుండా వచ్చిన ఈ సాంగ్ ని మహేష్ ఫ్యాన్స్ తో పాటుగా కామన్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు.





దేశ రాజధానిలో భారీ పేలుళ్లు 8 మంది మృతి

Loading..