బిగ్ బాస్ సీజన్ 9 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్, టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్న భరణి బంధాల బారిన పడి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. రీ ఎంట్రీ ఇచ్చాక భరణి మారుదామని ట్రై చేసినా దివ్య, తనూజ ల వలన భరణి గ్రాఫ్ ఇంకా ఇంకా పడిపోతుంది. తనూజ రియలైజ్ అయ్యి భరణి కి దూరంగా ఉంటున్నా దివ్య మాత్రం భరణి ని వదలడం లేదు.
గత వారం దివ్య భరణి విషయంలో తనూజ ను టార్గెట్ చేసింది. తనూజ ను నామినేట్ చేసి ఎలిమినేషన్ లోకి పంపించిన దివ్య అదే వారం కెప్టెన్సీ టాస్క్ నుంచి తనూజ ను ఎలిమినేట్ చెయ్యడం అది కూడా దివ్య.. భరణి విషయం లో కావడం అందరికి షాకిచ్చింది. దానిని నాగార్జున వీడియోస్ వేసి చూపించడంతో దివ్య ముసుగు తొలిగిపోయింది. ఇక భరణి ఇంప్రూవ్ అవ్వడం లేదు, ఇంకా స్టాండ్ తీసుకోవడం లేదు అంటూ అటు నాగ్ ఇటు హౌస్ మేట్స్ అనేసరికి భరణి లో పౌరుషం మొదలైంది.
ఈవారం నామినేషన్స్ లో దివ్య ను భరణి నామినేట్ చేసి ఆమెకు షాకిచ్చాడు. విద్య మాత్రం నా వలనే మీరు ఎలిమినేట్ అయ్యారు అనేది అబద్దం, అదే విషయం వైల్డ్ కార్డ్ వాళ్ళు చెప్పారు, నేను ఆ వీక్ నామినేట్ అయినా ఆడియన్స్ నన్ను ఎలిమినేట్ చెయ్యలేదు, మీ ఎలిమినేషన్ లో నా తప్పు లేదు అంది, అంతేకాకుండా బంధాల వలన అంటూ నా వల్ల మాత్రమేనా మీరు బయటికి వెళ్ళింది, నన్నెందుకు అంటున్నారు అంటూ దివ్య జారీచేసింది.
ప్రస్తుతం నీ వంతు, ఆ సమయం వచ్ఛినప్పుడు వాళ్లతోను మాట్లాడతాను అంటూ భరణి దివ్య ని నామినేట్ చెయ్యడం మాత్రం ఈ సీజన్ మొత్తానికి హైలెట్ అనే చెప్పాలి.





ప్రభాస్ ఆతిథ్యానికి ఫౌజీ హీరోయిన్ ఇంప్రెస్

Loading..