పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆతిథ్యానికి ఇంప్రెస్ అవ్వని నటులెవరైనా ఉంటారా, హీరోయిన్స్ ఉంటారా.. ఉండరు. మహారాజు ల అతిథ్యం ప్రభాస్ ఇంటివాళ్లది. వాళ్ళు కూడా రాజులే కదా.. అందుకే అతిధి మర్యాదలు ఎక్కువ. స్నేహితులకే కాదు, తనతోటి పని చేసే నటులకు కూడా ప్రభాస్ తన ఇంటి నుంచి పంపించే క్యారియర్స్ పై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ లు చూస్తూనే ఉంటాము.
ఇప్పుడు ఆ లిస్ట్ లో ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి కూడా చేరింది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్-ఇమాన్వి కలయికలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. మరి హైదరాబాద్ అంటే ప్రభాస్ ఊరుకుంటారా.. తన హీరోయిన్ ఇమాన్వి కి తన ఇంటి నుంచి స్పెషల్ వంటకాలతో క్యారియర్ పంపించారు. ఆ విషయాన్ని ఇమాన్వి అభిమానులతో షేర్ చేసుకుంది.
ప్రభాస్ ఆతిథ్యాన్ని స్వీకరించిన ఇమాన్వి.. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను షేర్ చేస్తూ మీ ఆతిథ్యానికి నా మనస్సు, పొట్ట నిండిపోయాయి థ్యాంకూ ప్రభాస్ గారూ అని పోస్ట్ చేశారు. మరి ప్రభాస్ ఆతిథ్యానికి హీరోయిన్ ఇమాన్వి ఎంతగా ఇంప్రెస్ అయ్యిందో ఈ పోస్ట్ చూస్తే అర్ధమవుతుంది.





మాస్ రాజా విజ్ఞపి విన్నారా 

Loading..