మాస్ మహారాజ్ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తిచేస్తున్నాడు. మాస్ జాతర తో డిజప్పాయింట్ చేసిన రవితేజ దానినుంచి చాలా త్వరగా బయటికొచ్చేసి కిషోర్ తిరుమల దర్శకత్వంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాన్ని ఫినిష్ చెయ్యడమే కాదు 2026 సంక్రాంతి స్పెషల్ గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
అందులో భాగంగానే RT 76 గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. చాలా కొత్తగా రవితేజ-కిషోర్ తిరుమల చిత్రానికి టైటిల్ ని అనౌన్స్ చేశారు. భక్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ గుడిలో వినిపించినట్టుగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ రవితేజ చాలా స్టయిలిష్ గా దర్శనమిచ్చారు.
తనని ఇద్దరు ఆడవాళ్లు పెట్టిన ఇబ్బందులు, అడిగిన ప్రశ్నలకు ఇలా అంటూ రవితేజ ఈ గ్లింప్స్ లో వన్ మ్యాన్ షో చేసారు. హీరోయిన్స్ ఆషిక రంగనాధన్, డింపుల్ హయ్యాతి లు గ్లామర్ గా కనిపించారు. రవితేజ మాత్రం ఈసారి డిఫ్రెంట్ గా ట్రై చేస్తున్నట్టుగా ఈ గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది. ఏదైనా ఈ చిత్రాన్ని సంక్రాంతి రిలీజ్ అంటూ అందరిలో క్యూరియాసిటీ కలిగించారు.





ప్రభాస్ ఫ్యాన్స్ నిజంగా పాపం 

Loading..